Personality Development : 30 ఏళ్ల వయసు వచ్చిందా? ఈ మార్పులు మస్ట్

Personality Development : ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఆరోగ్యకరంగా ఉండడం అనేదాన్ని కూడా ఒక పనిగానే పెట్టుకుంటున్నారు. లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు, ఆహార పదార్థాలలో పెరుగుతున్న కల్తీ, కాలుష్యం వంటి కారణాలవల్ల చిన్న వయసులోనే తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు జనాలు. కాబట్టి చాలామంది ప్రస్తుతం తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక అందులో భాగంగానే 30 ఏళ్ల వయసులోకి వచ్చాక కొన్ని ముఖ్యమైన మార్పులను మీ లైఫ్ స్టైల్ లో చేసుకోవడం మంచిది. 30 ఏళ్ల వయసు అనేది జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ ఏజ్ తర్వాత ఆరోగ్యంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. అందుకే 30 ఏళ్ల నుంచి రొటీన్ లో కొన్ని మంచి అలవాట్లను తప్పనిసరిగా అలవర్చుకోవాలని అంటారు ఆరోగ్య నిపుణులు. అలాగైతేనే రోగాల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. మరి ఇంతకీ ఈ 30 ఏళ్ల వయసు వచ్చాక వ్యాధులను నివారించడానికి ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి అంటే…

1. ఉదయాన్నే నిద్ర లేవడం

ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఆరోగ్యానికి, మనసుకు కూడా మేలు చేకూరుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో జనాలు గంటల తరబడి ఫోన్లతో బిజీగా ఉంటున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల ఉదయాన్నే లేట్ గా లేస్తున్నారు. కానీ పొద్దున్నే నిద్ర లేచే వారి వ్యక్తిత్వంలో పాజిటివిటి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వ్యాయామం, వాకింగ్ వంటివి చేయడం వల్ల వాళ్ళు హెల్దిగా ఉంటారు.

2. వ్యాయామం

30 ఏళ్ల వయసు అనేది ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఈ ఏజ్ దాటాక ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి శారీరకంగా చురుకుగా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి. దీంతోపాటు ధ్యానం, యోగ వంటివి చేస్తే మరింత ఉల్లాసంగా ఉంటారు.

- Advertisement -

3. ఆరోగ్యకరమైన ఆహారం

కడుపు ఆరోగ్యంగా లేకపోతే శరీరం రోగాల పుట్టగా మారుతుంది. కడుపు, కాలేయం, మూత్రపిండాలు ఇతర అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం సరైన ఆహారపు అలవాట్లను ఫాలో అవ్వాలి. ఈరోజుల్లో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా లాగించేస్తున్నారు. వీటి బదులు ఆహారంలో పచ్చని కూరగాయలు, పండ్లను చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాలి.

4. ఒత్తిడికి దూరంగా…

బిజీ లైఫ్ లేదా పలు బాధ్యతలు భారం కారణంగా చాలామంది ప్రస్తుత తరం యూత్ ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఒత్తిడి పెరిగి అది డిప్రెషన్ గా మారుతుంది. చిన్న వయసులోనే ఒత్తిడి పెరిగితే అది గుండెపోటుకు దారి తీస్తుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.

5. ప్రస్తుతం భారతదేశంలో క్యాన్సర్, గుండెపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి అనారోగ్యాల బారిన పడడానికి ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఈ బిజీ లైఫ్ కారణంగా జనాలు బయట తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం, నిద్ర లేవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్ల కారణంగా శరీరం లోగాలకు నిలయంగా మారుతుంది. దీనివల్ల ఊబకాయం సమస్య కూడా పెరుగుతుంది. ఈ సమస్యను ముందుగానే పసిగట్టి కంట్రోల్ చేయకపోతే చిన్న వయసులోనే డయాబెటిక్, హై బిపి వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు