Neha Sharma : ఇండస్ట్రీ చీకటి కోణాలు బయటపెట్టిన చెర్రీ బ్యూటీ..!

Neha Sharma : టాలీవుడ్లో రామ్ చరణ్ నటించిన మొట్టమొదటి సినిమా చిరుతతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ నేహా శర్మ.. ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ.. అక్కడ కూడా ఒక మోస్తారు సినిమాలలో అలరిస్తోంది. మొదట 2010లో ఇమ్రాన్ హస్మీ నటించిన క్రూక్ అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 13 ఏళ్లు అవుతున్నా.. సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతోంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ చీకటి నిజాలను సైతం బయటపెట్టినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో జరిగేది ఇదే..

బోల్డ్ గ్లామరస్ నటిగా పేరుపొందిన నేహా శర్మ.. మోడలింగ్ వైపుగా తన కెరీర్ ని మొదలుపెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విషయాలను తెలియజేసింది.. తాను ఒక సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన తర్వాత తనను తొలగించడానికి చాలాసార్లు చాలామంది ప్రయత్నించారని కూడా తెలియజేసింది.. ఏవైనా ఒక ఐదు చిత్రాలకు ఆడిషన్ జరుగుతున్న సమయంలో.. మనం ఐదు సినిమాలకు ఆడిషన్ ఇవ్వచ్చు కానీ అందులో ఒకటో రెండో సినిమాలు మాత్రమే మనకి వస్తాయి.. కొన్ని సందర్భాలలో కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినా నటించడం ఇష్టం లేకపోయినా కూడా నటించాల్సి ఉంటుందంటూ తెలియజేసింది.

అవకాశం కావాలంటే అది ఉండాల్సిందే..

ఇటీవలే ఒక సినిమాలో హీరోయిన్ గా తనకు అవకాశం వచ్చినా.. చివరి క్షణంలో తన స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకువచ్చారని తెలిపింది. అంతేకాదు అది తనను షాక్ కు గురిచేసింది అంటూ తెలియజేసింది నేహా శర్మ.. ఒక సినిమాలో నన్ను ఒక సన్నివేశం కోసం టెస్టు చేశారు.. నేను నాలుగు ఐదు సార్లు ఆ సీన్లలో నటించాను.. టీం మొత్తం మద్దతు నాకు లభించింది.. ఆ పాత్రలో సరిపోతానని ప్రతిదీ సరిగ్గా ఉందని భావించాను.. కానీ అనుకోని విధంగా.. మీరు ఇందులో భాగం కాదని నాకు ఫోన్ చేసి తెలిపారని చెప్పింది నేహా శర్మ. అయితే తనను ఎందుకు ఈ చిత్రంలో తీసుకోలేదని అడగగా.. నీ కంటే ఎక్కువ మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక టాలెంటెడ్ నటిని తీసుకున్నామని.. అందుకే తనని రిజెక్ట్ చేశారని చెప్పారట.

- Advertisement -

దీంతో భవిష్యత్తులో ఎవరైనా సినిమా లేదా షోలో నటించడం అనేది కూడా వారి యొక్క సోషల్ మీడియా పైనే ఆధారపడి ఉంటుందని తెలుపుతోంది నేహా శర్మ ( Neha Sharma ). దాదాపుగా ఈమె ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయినా సరే తనకు అవకాశం ఇవ్వలేదని వాపోయింది.. ఇకపోతే బాలీవుడ్ లో ఎప్పుడు ఎవరిని ఎలా ఓకే చేస్తారో కూడా చెప్పడం అసాధ్యం అంటూ నేహా శర్మ చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ లో ఎన్నో కమిట్మెంట్స్ ఆ చీకటి కోణాలను ఇంకా నేను బయటకు చెప్పడం సరికాదు అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ ఏది ఏమైనా నేహా శర్మ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు