Star Singers Remuneration : ఈ స్టార్ సింగర్ లలో ఎవరి పారితోషికం ఎంతంటే..?

Star Singers Remuneration : ప్రస్తుత కాలంలో ఒక సినిమా పూర్తి అవ్వాలంటే దర్శకుడు, రచయిత, నిర్మాత, హీరో, హీరోయిన్లు మాత్రమే ఉంటే సరిపోదు… మిగతా 24 విభాగాలలో ప్రతి ఒక్కరు పనిచేసినప్పుడే సినిమా పూర్తవుతుంది. ఇక అలా సినిమాకు ప్రాణదానమైన వారిలో సింగర్స్ కూడా ప్రథమ స్థానంలో ఉంటారనే చెప్పాలి. ఒక పాట అద్భుతంగా వచ్చింది అంటే ఆ సినిమా కథ బాగలేకపోయినా పాటల ద్వారా కూడా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది తెలుగు సింగర్స్ కి  మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. వారి పాట వచ్చిందంటే గంటల్లోనే ట్రెండ్ అవుతుంది. అందుకే సింగర్స్ కి అంత ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ సింగర్స్ కూడా తమ సీనియార్టీని బట్టి అలాగే తాము పాడే పాటల పాపులారిటీని బట్టి కూడా పారితోషకం పెంచేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న యంగ్ సింగర్స్ లో ఎవరు ఎంత పారితోషకం తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

సిద్ శ్రీరామ్…

ప్రస్తుతం ఉన్న జనరేషన్ సింగర్స్ లో మొదటి స్థానంలో సిద్ శ్రీరామ్ నిలుస్తారు. ఈయన ఒక్కో పాటకి సుమారుగా రూ.7 లక్షల వరకు పారితోషకం తీసుకుంటారు. బడ్జెట్, సినిమా రేంజ్ ను బట్టి రూ.లక్ష అటు ఇటుగా ఉంటుందని సమాచారం.

రామ్ మిరియాల…

ప్రామిసింగ్ సింగర్స్‌లో ఒకరైన రామ్ మిరియాల తన ప్రత్యేకమైన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఫోక్ నుంచి క్లాసిక్స్ వరకు ఎలాంటి పాటలైనా అద్భుతంగా పాడుతూ మెప్పిస్తున్నారు. ఇక ఈయన ఒక్కో పాటకి రూ.3 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

అనురాగ్ కులకర్ణి…

సెన్సేషన్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ ప్రస్తుతం ఒక్కో పాటకి 3లక్షల రూపాయలు పారితోషకంగా తీసుకుంటున్నారు.

శ్వేతా మోహన్…

ఇటీవలే మాస్టారు మాస్టారు అంటూ దుమ్మురేపింది ఈ ముద్దుగుమ్మ.. ఈ పాటతో స్టార్ సింగర్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఒక్కో పాటకి రూ.3 లక్షల వరకు అందుకుంటుందని సమాచారం.

గీతా మాధురి…

ఒకప్పుడు స్పెషల్ వాయిస్‌తో అందరినీ అలరించి… నస్కీ వాయిస్‌తో పాటలు పాడుతూ మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఐటమ్ సాంగుల కు భారీ ఫేమస్. అయితే ఇప్పుడు ఈమె జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఒక్కో పాటకి రూ.1లక్ష లేదా రూ.1.50 లక్షలు మాత్రమే తీసుకుంటుందని సమాచారం.

సింగర్ మంగ్లీ..

ఫోక్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ మంగ్లీ. మంచి ఊపు తెచ్చే పాటలతో పాటు డివోషనల్ పాటలు పాడుతూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ఇక ఈమె సింగర్ మాత్రమే కాదు పలు సింగింగ్ కాంపిటీషన్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సింగర్‌గా ఒక్కో పాటకి రూ. 3 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

వీరితో పాటు ఫీమేల్ సింగర్స్ లో భాగమైన రమ్య బెహరా, లిప్సిక, దామిని భట్ల , యామిని , సమీరా భరద్వాజ్ , మోహన భోగరాజు , సత్యా యామిని, మౌనిమ, సాహితి వంటి సింగర్స్ కూడా ఒక్కోపాటికి లక్ష రూపాయల వరకు పారితోషకం ( Star Singers Remuneration ) తీసుకుంటున్నారు.

అటు మేల్ సింగర్స్ లో రేవంత్, శ్రీరామచంద్ర , రోహిత్, శ్రీకృష్ణ , రాహుల్ సిప్లిగంజ్, ఆర్య ధయాల్ వంటి వారు దాదాపుగా ఒక్కో పాటకి రూ .2లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు