White Rice vs Brown Rice : వైట్ రైస్, బ్రౌన్ రైస్ మధ్య ఇదే తేడా… ఎవరు ఏం తినాలంటే?

White Rice vs Brown Rice : భారతీయ సాంప్రదాయ ఆహారంలో అన్నం కూడా ముఖ్యమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతదేశంలో మాత్రమే అన్నంకు ఇంత ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. విదేశాల్లో సైతం మన భారతీయ ఫుడ్ ను జనాలు బాగా ఇష్టపడుతున్నారు. అయితే అక్కడ కేవలం ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ మాత్రమే దొరుకుతాయి. అతి తక్కువ ప్లేస్ లలో అన్నం కూడా వండుతారు. ఇక అన్నం లేకపోతే అసలు కడుపు నిండినట్టుగా ఫీల్ అవ్వని వాళ్ళు ఎంతోమంది. భోజనం పూర్తయింది అనిపించాలంటే కచ్చితంగా ప్లేట్లో ఎంతో కొంత అన్నం ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నం లేకపోతే అది అసలు భోజనమే అనిపించదు. టిఫిన్స్ ను ఇడ్లీ, వడ, దోస, పూరి లాంటి వాడితో సరిపెట్టినప్పటికీ లంచ్, డిన్నర్ లలో కచ్చితంగా అన్నం ఉండి తీరాల్సిందే. పొగలు కక్కే అన్నాన్ని చూడగానే వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ, ఇంత నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఉంటది… నా సామిరంగా అని దేశముదురు మూవీలో కోవై సరళ చెప్పిన డైలాగ్ గుర్తు రావడం ఖాయం.

అయితే బరువు తగ్గడం కోసం డైట్ చేసేవాళ్ళు కొంతమంది వైట్ రైస్ కు దూరంగా ఉంటారు. అలాంటి వాళ్లు అన్నాన్ని పూర్తిగా వదిలేస్తారని కాదు. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడతారు. మరి ఇంతకీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైన ఆహారం? వైట్ రైస్, బ్రౌన్ రైస్ కు మధ్య ఉండే తేడా ఏంటి? ఎవరు ఏ రైస్ తింటే మంచిది? అనే వివరాల్లోకి వెళితే…

బ్రౌన్ రైస్ వర్సెస్ వైట్ రైస్…

అన్నం లేకుండా భారతీయ భోజనం అసంపూర్ణం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రౌన్ రైస్, వైట్ రైస్ లలో ఆరోగ్యానికి ఏది మంచిది? అనే ప్రశ్న వేస్తే డైటీషియన్లు మాత్రం వైట్ రైస్ కంటే బ్రౌన్ రైసే ఎక్కువ ఆరోగ్యకరం అని చెబుతున్నారు. మరి ఈ రెండింటికి తేడా ఏంటి అంటే వైట్ రైస్ ను ప్రాసెస్ చేస్తారు. ఇక బ్రౌన్ రైస్ తృణధాన్యాల కింద లెక్కించబడుతుంది. అలాగే ఇందులో మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు డైటీషియన్లు. బ్రౌన్ రైస్ లో విటమిన్ బి కాంప్లెక్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్రౌన్ రైస్ డయాబెటిక్ పేషెంట్స్ కు హెల్దీ ఫుడ్ అవుతుంది.బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ హెల్దిగా ఉంటుంది.

- Advertisement -

వైట్ రైస్ అనారోగ్యకరమా?

అయితే వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ అనే అంశం తెరపైకి వచ్చాక చాలామంది వైట్ రైస్ అనారోగ్యకరమని భావిస్తున్నారు. కానీ నిజానికి అదొక అపోహ మాత్రమే. అయితే వైట్ ప్రైస్ లో పిండి పదార్థాలు, స్టార్చ్ ఎక్కువగా ఉంటాయి. దీని గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిక్, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. అంతేగాని వైట్ రైస్ అనారోగ్యకరం అనే రీజన్ మాత్రం కాదు. ఇక ఇండియాలోని ఎక్కువ మంది ఇప్పటికీ కూడా వైట్ రైస్ ని ఎక్కువగా వండుకుంటూ ఉంటారు. బ్రౌన్ రైస్ కొద్దిగా తినగానే కడుపు ఫుల్ అయిపోతుంది. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఈ కారణం చేతనే త్వరగా బరువు తగ్గుతారు. అందుకే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు బ్రౌన్ రైస్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు