Tillu Square Movie : టిల్లు 100 కోడితే… అది కొండన్న పుణ్యమే

Tillu Square Movie : ఈ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తుంది. ఇది కొంత మంది నిర్మాతల వల్ల జరుగుతుందని అని చెప్పొచ్చు. గల్లా పెట్టే నిండుతుందో… లేదా, పోస్టర్ నిండుగా కనపడటానికి చేస్తున్నారో తెలియదు కానీ, చాలా సినిమాలు 100 కోట్ల వరకు వస్తున్నాయి.

ఈ మధ్య టిల్లు స్క్వేర్ అనే ఓ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎలాగైన 100 కోట్లు కొట్టి తీరుతుందని నిర్మాత నాగ వంశీ బల్ల గుద్ది మరీ చెప్పాడు. మూవీ రిలీజ్ అయి ఎనిమిది రోజులు అవుతుంది. ఈ ఎనిమిది రోజుల్లో టిల్లు స్వ్కేర్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 96 కోట్లు వచ్చాయట. ఈ విషయాన్ని ఓ కలర్ ఫుల్ పోస్టర్ డిజైన్ చేసి, దాన్ని రిలీజ్ చేసి అఫిషియల్ గా అనౌన్స్ చేశారు నిర్మాతలు. ఒక మూవీ 96 కోట్లు రావడం తప్పా…? అంటే కానే కాదు. కానీ, టిల్లు స్క్వేర్ మూవీకి అంత లేదు అని క్రిటిక్స్ నుంచి వస్తున్న మాట.

ఇలా ఎందుకు ఆ… టాక్ వస్తుంది అంటే…? టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయిన టైంలోనే మలయాళంలో ది గోట్ లైఫ్ అనే ఓ మూవీ రిలీజ్ అయింది. అది ఓ ప్రయోగాత్మక చిత్రం. ఆ సినిమా కోసం పృథ్వి రాజ్ సుకుమార్ చాలా ఏళ్ల పాటు కష్టపడ్డాడు. మూవీ అవుట్ పుట్ కూడా అలాగే ఉంది. అలాంటి మూవీ 9 రోజుల్లో 100 కోట్లు కొట్టింది. ఈ రెండు సినిమాలను పోల్చాల్సి వస్తే, అందరి మార్కులు ది గోట్ లైఫ్‌కే పడుతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయినా, టిల్లుకు ది గోట్ లైఫ్‌తో సమానంగా కలెక్షన్లు వస్తున్నాయి.

- Advertisement -

ఫ్యామిలీ స్టార్ మైనస్…

ఈ వారం విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీతో టిల్లు స్వ్కేర్ మూవీ కలెక్షన్లు తగ్గుతాయని అనుకున్నారు అంతా. అది ఎందుకు అంటే, తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. కానీ, ఎవరూ ఊహించని విధంగా, ఫ్యామిలీ స్టార్‌కు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఫస్ట్ షో నుంచే ఫ్యామిలీ స్టార్ ట్రోల్ కంటెంట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత డిజాస్టర్ మూవీలుగా నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ లను చూస్తారు. ఫస్ట్ డే కలెక్షన్లు ఈ రెండు సినిమాల కంటే తక్కువ ఫ్యామిలీస్టార్ కు వచ్చాయి.

ఇదే టిల్లుకు ప్లస్…

ఫ్యామిలీ స్టార్ మూవీకి నెగిటివ్ టాక్ రావడం ఇప్పుడు టిల్లుకు బాగా కలిసొస్తుంది. 100 కోట్ల మార్క్ అందుకోవడం కష్టమే అనుకునే సమయంలో విజయ్ దేవరకొండ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఆడిషన్స్ మొత్తం టిల్లు స్క్వేర్ మూవీ ( Tillu Square Movie ) వైపునకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ 96 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 100 కోట్లు రావడానికి మరో 4 కోట్లు వస్తే సరిపోతుంది. అది రేపటితో జరగొచ్చు. అదే జరిగితే, అంతా కొండన్న పుణ్యమే అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు