100 Cr Malayalam Movies : ఫాస్టెస్ట్ 100 cr మూవీ ఇదే… మలయాళంలో రికార్డ్

100 Cr Malayalam Movies : మలయాళ సినిమా ఇండస్ట్రీ ఈ ఏడాది గర్వంగా తలెత్తుకునే పరిస్థితి నెలకొంది. వరుసగా 3 బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇతర వుడ్ లకు గట్టి ఛాలెంజ్ విసురుతోంది. తాజాగా మలయాళంలో 9 రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది “ఆడుజీవితం” మూవీ. కలెక్షన్స్ లోనే కాదు కంటెంట్, క్వాలిటీ విషయంలో కూడా మలయాళ సినిమాలు అదరగొడుతున్నాయి. మలయాళంలో ఈ ఏడాది నాలుగు 100 కోట్ల సినిమాలు వచ్చాయి. ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్, ఆడుజీవితం చిత్రాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం అన్ని భాషల ప్రేక్షకులు మలయాళ సినిమాలను వీక్షించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ ఇండస్ట్రీలో టాప్ 6 ఫాస్టెస్ట్ 100 కోట్ల సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.

100 కోట్లు కొల్లగొట్టిన మలయాళం మూవీస్ ఇవే

1. ఆడుజీవితం

బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మూవీ “ఆడుజీవితం”. అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. 1990వ దశకంలో జీవనోపాధిని వెతుక్కుంటూ అరబ్ దేశానికి వలస వెళ్లిన కేరళ యువకుడు అక్కడ బానిసగా మారి, మండుటెండలో ఎడారిలో గొర్రెల కాపరిగా అతను పడిన కష్టాలు, అక్కడి నుంచి ఎలా బయట పడ్డాడు అనే వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యా మీన్ గోట్ లైఫ్ అనే నవలను రాశారు. దీని ఆధారంగానే “ఆడుజీవితం / ది గోట్ లైఫ్” మూవీ తెరెకెక్కింది. 2009లో అనౌన్స్ చేసిన ఈ మూవీ ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరికి 2024లో రిలీజ్ కు నోచుకుంది. నజీబ్ పాత్రను పోషించడానికి పృథ్వీరాజ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది చిత్రబృందానికి. మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన ఆడుజీవితం కేవలం 9 రోజుల్లోనే మళయాలంలో 100 కోట్లు కొల్లగొట్టిన మొట్ట మొదటి మూవీగా ( 100 Cr Malayalam Movies ) రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో మాత్రం ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

2. 2018

ఈ లిస్ట్ లో రెండవ స్థానంలో ఉన్న మూవీ “2018”. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ డ్రామా “2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో”. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీ కేరళను కుదిపేసిన వరదలు అక్కడి ప్రజల జీవితాలను ఎలా అల్లకల్లోలం చేశాయి అనే స్టోరీతో రూపొందింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. 2023లో రిలీజైన “2018” కేవలం 11 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది.

- Advertisement -

3. లూసిఫర్

స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా “లూసిఫర్”. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీ 2019లో రిలీజ్ కాగా, 12 రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

4. మంజుమ్మెల్ బాయ్స్

చిదంబరం దర్శకత్వం వహించిన మలయాళ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ రీసెంట్ గా రిలీజై 12 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సర్వైవల్ అండ్ బ్రేవరీ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈరోజే మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో కూడా రిలీజయ్యింది.

5. ప్రేమలు

ఈ ఏడాది 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన మలయాళ సినిమాల్లో “ప్రేమలు” 5వ స్థానాన్ని దక్కించుకుంది. గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్ కె, గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా కన్పించారు. యూత్ ను బాగా అట్ట్రాక్ట్ చేసిన ఈ మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే.

6. పులిమురుగన్

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన మూవీ “పులిమురుగన్“. ఈ మూవీ 2016లోనే కేవలం 36 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు