Asha borra: ఫ్యామిలీ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు.. అందుకే డిజాస్టర్..!

Asha borra.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కించారు.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని తన సోదరుడు శిరీస్ తో కలిసి నిర్మించారు.. ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళుతోంది. దాదాపుగా క్రిటిక్స్ అందరూ కూడా ఈ సినిమా బాగాలేదని చెబుతున్నారు.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి వెళుతున్నట్టుగా తెలుస్తోంది..

ఫ్యామిలీ స్టార్ యూనిట్ పై యూట్యూబర్ షాకింగ్ కామెంట్స్..
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో కేవలం ఒకే ఒక సన్నివేశంలో కనపడిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మాత్రం చిత్ర యూనిట్ పైన దుమ్మెత్తి పోస్తోంది. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు ద్వారా ఒక వీడియోని షేర్ చేసి చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది.. ఈమె ఎవరో కాదు సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆశా బొర్రా. ఈమె సినిమా మొదలైన వెంటనే విజయ్ దేవరకొండ తో కలిసి కేవలం ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపిస్తుంది.

యూట్యూబర్ ఆగ్రహం..
ఈ విషయం పైన ఆమె స్పందిస్తూ.. ఒక పోస్టుని రాసుకొచ్చింది.. నాలాంటి దాన్ని పిలిచి అవుట్ స్టాఫ్ లాగా వాడుకొని వదిలేస్తే.. సినిమా అట్టర్ ప్లాప్ కాకుండా ఉంటుందా అంటూ.. ఫ్యామిలీ స్టార్ కి కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్.. ఇంతటి అప్పిరియన్స్ కి నా టైం వేస్ట్ చేసి.. మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. అంటూ పోస్ట్ చేసింది..మీరు ఈ క్యారెక్టర్ చేయండి అని.. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు వరుసగా ఫోన్లు చేయడం.. హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్టులకు కరువు వచ్చిందా లేక సోషల్ మీడియాలో ఫేమస్ ను వాడుకోవాలని చేశారా తెలియదు అంటూ ఆమె వెల్లడించింది..

- Advertisement -

రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు..
అలాగే మా పనులు మానుకొని ఫ్యామిలీని వదిలేసి ఒక రోజంతా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఆరోగ్యం బాగా లేకపోయినా షూట్ డేట్ సమయానికి వచ్చాను.. ఇచ్చిన ఒక్క మాట కోసం వచ్చాను.. యాంటీబయోటిక్స్ వేసుకొని నిలువు కాళ్ళ మీద నిలబడి మరీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పనిచేశాను.. కనీసం ఒక్క డైలాగ్ అయిన ఉండి ఉంటే ఇంత రాయవలసిన అవసరం లేదంటూ తెలిపింది.. అలాగే ఇస్తామన్న రెమ్యూనరేషన్ ఇవ్వకుండా.. కనీసం చార్జీలు కూడా ఇవ్వకుండా హోటల్ స్టే కి డబ్బులు ఇవ్వకుండా మాకు ఏంటి సంబంధం అన్నట్లుగా వ్యవహరించారని తెలిపింది..

యూనిట్ మొత్తం వేస్ట్..
చాలా గ్రేట్..కనీసం విజయ్ దేవరకొండ కి నాకు ఉన్న కాన్వర్జేషన్ ఉంచినా కొంత సాటిస్ఫాక్షన్ ఉండేదేమో.. మీ ఎడిటింగ్ కి ఒక దండం.. ఇలా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థాంక్స్ అంటూ మరొకసారి నా కళ్ళు తెరిపించారు అంటూ ఆమె ఒక వీడియోతో సహా పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.. ప్రస్తుతం ఈ పోస్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. మొత్తానికైతే ఫ్యామిలీ స్టార్ యూనిట్ ఈమెను బాగా హార్ట్ చేశారని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Asha Borra (@asha.borra)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు