Adah Sharma : సుశాంత్ సింగ్ ఇల్లు కొనడంపై అదా శర్మ రియాక్షన్… క్లారిటీ కాదు కన్ఫ్యూజన్

Adah Sharma : కేరళ స్టోరీ అనే కాంట్రవర్సీ మూవీతో పాపులర్ అయిన హీరోయిన్ అదా శర్మ. ఈ ఒక్క సినిమాతో ఎన్ని ప్రశంసలు అందుకుందో అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా అదా కాంట్రవర్సీ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. అయితే కేరళ స్టోరీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొట్టింది. ఈ చిత్రం సూపర్‌ హిట్ అయ్యాక అదా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అపార్ట్‌మెంట్‌ను కొనుక్కుందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అదా మరోసారి టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. అయితే సుశాంత్ ఇల్లు కొనడం గురించి తాజాగా స్పందించిన అదా అభిమానులకు క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఇంతకీ ఈ వార్తలపై అదా రియాక్షన్ ఏంటి అంటే?

ఇది కరెక్ట్ కాదు…

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అదా శర్మ తాను సుశాంత్ ఇంటిని కొనుగోలు చేసింది అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది. తాను ప్రజల హృదయాల్లో బతుకుతున్నాను, ప్రస్తుతానికి ఇదే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను అంటూ రిప్లై ఇచ్చింది అదా. ఎంఎస్ ధోనీ, చిచోరే వంటి సినిమాలతో ఆకట్టుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ఆత్మహత్య చేసుకుని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను ఆ ఇంటిని చూడడానికి వెళ్ళినప్పుడు మీడియా స్పందన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించింది.

తన వ్యక్తిగత జీవితంలో లైమ్‌లైట్‌కి దూరంగా ఉంటానని అదా తెలిపింది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అపార్ట్‌మెంట్ ను అదా శర్మ కొనుక్కుంటుంది అనే వార్తలు బయటకు వచ్చినప్పుడు కొంతమంది తన గురించి చేసిన కొన్ని కామెంట్స్ ను గుర్తు చేసుకుని బాధపడింది. ప్రస్తుతం ఈ లోకంలో లేని వ్యక్తి గురించి అలా మాట్లాడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా అదా మాట్లాడుతూ “అద్భుతమైన చిత్రాలను అందించిన సుశాంత్ ఇప్పుడు ఈ లోకంలో లేడు, కాబట్టి అతని గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మంచి నటుడిగా ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. నన్ను ట్రోల్ చేసినా పర్లేదు. కానీ ఇప్పుడు మన మధ్య లేని వ్యక్తిని ట్రోల్ చేయడం మంచిది కాదు. నేను ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నానో త్వరలో చెబుతాను, కానీ ప్రస్తుతం నేను మిలియన్ల మంది హృదయాల్లో నివసిస్తున్నాను అని మాత్రం చెప్పగలను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అసలామె సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని కొనుక్కుందా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు సరికదా కన్ఫ్యూజన్ నెలకొంది.

అదా శర్మ సినిమాల విషయానికొస్తే…

బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ ( Adah Sharma ) ఇటీవల “బస్తర్ ది నక్సల్” స్టోరీలో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం అదా “ది గేమ్ ఆఫ్ గిర్గీత్” అనే మూవీ చేస్తోంది. ఇదిప్పుడు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు