Sushanth Singh Rajput: సుశాంత్ గురించి బయటపడ్డ అసలు నిజాలు ఇవే..!

Sushanth Singh Rajput: బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ఏర్పరచుకున్న హీరోలలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఒకరు. మొదట బుల్లితెర నుంచి తన కెరీర్ ను ప్రారంభించిన ఈ నటుడు బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా చిన్న వయసులోనే మరణించారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ముంబైలో గల ఆయన నివాసం బద్రాలో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ కేసు ఇంకా నడుస్తుంది. అయితే బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలలో నటించిన సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా ఈ నటుడిని ఎవరు మర్చిపోలేక పోతున్నారు.

నిన్నటి (జనవరి 21) రోజున సుశాంత్ పుట్టినరోజు కావడం చేత ఈయనకు సంబంధించి పలు రకాల వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ముఖ్యంగా అభిమానులు సైతం సుశాంత్ ను గుర్తు చేసుకుంటూ పలు రకాల ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. అయితే సుశాంత్ గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.. సుశాంత్ ఎక్కువగా సినిమాలను థియేటర్లకు వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని చూసేవారట.. కానీ సినిమా అయిపోయిన తర్వాతే అభిమానుల ముందుకు వచ్చేవారని తన సొంత సినిమా అయినా సరే అభిమానుల మధ్య ఉంటూ చూసేవారట.

ఇలాంటి అలవాటు చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది.. సుశాంత్ బాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు పలు సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కూడా పనిచేశారు. అలాగే కామన్ వెల్త్ గేమ్ ముగింపు వేడుకలలో భాగంగా ఐశ్వర్యరాయ్ తో కలిసి డాన్సర్ గా బ్యాక్ గ్రౌండ్ లో పనిచేశారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన ధూమ్-2 లో కూడా బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గాని పనిచేశారు.

- Advertisement -

సుశాంత్ యాక్టింగ్ విషయంలోనే కాకుండా చదువులో కూడా మొదటి స్థానంలో వుండేవారు . సుశాంత్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదివిన మూడేళ్లకు నటన వైపుగా అడుగులు వేశారు.. అంతేకాకుండా ఫిజిక్స్ నేషనల్ ఒలంపియాడ్ విజేతగా కూడా నిలిచారు. సుశాంత్ ఎక్కువగా తన దగ్గర ఉన్న బైనాక్యులర్లతో చంద్రుడిని చూసేవారట. చంద్రుని పైన స్థలం కొన్న మొట్టమొదటి బాలీవుడ్ నటుడుగా కూడా సుశాంత్ పేరు సంపాదించారు. సుశాంత్ కి ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టమట అందుకే తన దగ్గర ఒక డైరీని రాసుకుంటూ ఉండేవారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు