Maheshbabu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. రీసెంట్గా మహేష్ బాబు జర్మనీకి సోలో ట్రిప్ వెళ్ళినట్లుగా ఎయిర్పోర్టులో పలు రకాల ఫోటోలు కూడా వైరల్ గా మారాయి అయితే ఎప్పుడు కూడా కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లే మహేష్ బాబు ఈసారి ఒంటరిగా వెళ్లడంతో ఫ్యాన్స్ మొత్తం SSMB -29 సినిమాకి సంబంధించి వర్క్ కోసమే వెళ్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మహేష్ బాబు జర్మనీకి వెళ్ళింది ఒక డాక్టర్ ను కలుసుకోవడం కోసం అన్నట్లుగా తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మహేష్ బాబు స్వయంగా పోస్ట్ చేసి ఒక ఫోటో కూడా షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారుతున్నది. అయితే మహేష్ బాబు డాక్టర్ ను కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా 2022 జూన్ లో పాటు గత ఏడాది ఏప్రిల్ నెలలో కూడా మహేష్ బాబు ఆ డాక్టర్ని కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మహేష్ తో దిగిన కొన్ని ఫోటోలను కూడా స్వయంగా ఆ డాక్టరే తన సోషల్ మీడియాలో నుంచి షేర్ చేయడం జరిగింది.
అయితే అభిమానులు మాత్రం అసలు ఆ డాక్టర్ ఎవరు? మహేష్ ఎందుకు అన్ని సార్లు అతడిని కలుస్తున్నారు..? ఆయన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు అభిమానులలో తలెత్తుతున్నాయి.. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ డాక్టర్ పేరు హరి కొనిగ్.. ఇతను బాడీ ఫిట్నెస్ కు సంబంధించిన వైద్యుడు అన్నట్లుగా తెలుస్తున్నది . ఈ మధ్యకాలంలో మహేష్ బాబు తన ఫిట్నెస్ పైన చాలా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా పలు రకాల జిమ్ వర్కౌట్లు వీడియోలను సైతం షేర్ చేస్తూనే ఉంటారు మహేష్ బాబు.
ముఖ్యంగా రాజమౌళితో తెరకెక్కిస్తున్న SSMB-29 సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అడ్వెంచర్ మూవీ థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ స్టన్స్ కూడా మహేష్ బాబు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు.. మరి ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా తెలిపారు. ఇక మహేష్ బాబు జర్మనీ నుంచి తిరిగి రాగానే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.
Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.