Tollywood Movies Shooting Update : ఏ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?

Tollywood Movies Shooting Update : ఐపీఎల్, ఎలక్షన్స్ వంటి కారణాలతో ఈ ఏడాది సమ్మర్ ను వదిలి పెట్టి సెకండ్ హాఫ్ పై దృష్టి పెట్టారు పెద్ద హీరోలు. దీంతో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలతోనే ఈ సమ్మర్ గడవబోతోంది. పెద్ద హీరోల సినిమాలు ఏమీ విడుదల కాకపోయినా, షూటింగ్ సెట్స్ మాత్రం కళకళ లాడుతున్నాయి. బడా హీరోలు అందరూ సెట్స్ లోనే ఉండడం విశేషం. మరి ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ( Tollywood Movies Shooting Update ) అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

1. కల్కి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటుంది కల్కి. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశారు మేకర్స్. మే 9న కల్కి మూవీ రిలీజ్ కానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఎలక్షన్స్ కారణంగా ఈ మూవీ వాయిదా పడబోతుందని, మే 30న రిలీజ్ కు రెడీ అవుతోందని ప్రచారం జరుగుతుంది.

2. దేవర

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది దేవర మూవీ. ప్రస్తుతం దేవర ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. గోవా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో తాజాగా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవర మూవీ అక్టోబర్ 10 న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

3. పుష్ప 2

ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2”. ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఇంకా సెట్స్ పైనే ఉంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక అల్లు అర్జున్ సైట్స్ లో జాయిన్ కాబోతున్నారు.

4. విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం మేకర్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా, చిన్న బ్రేక్ తీసుకున్న చిరంజీవి త్వరలోనే సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు.

5. NBK 109

బాలయ్య, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త మూవీ షూటింగ్ నిన్నటిదాకా రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది. ప్రస్తుతం చౌటుప్పల్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

6. మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ లక్నోలో జరుగుతోంది.

7. తండేల్

యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం బీహెచ్ఈఎల్ లో జరుగుతోంది.

8. కన్నప్ప

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

9. రాబిన్ హుడ్ అండ్ సరిపోదా శనివారం

ఎనర్జిటిక్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్, నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రానున్న సరిపోదా శనివారం సినిమాల షూటింగ్స్ మొయినాబాద్ లో జరుగుతున్నాయి.

10. గేమ్ ఛేంజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 10న స్టార్ట్ కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు