Subbaraju: ఈ టాలీవుడ్ విలన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?

Subbaraju..టాలీవుడ్ లో విలన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన నటులలో సుబ్బరాజు కూడా ఒకరు.. ప్రస్తుతం ఈయన వయసు 46 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నారు.. అందుకే సుబ్బరాజు పెళ్లి విషయంపై ఆయనని ఎన్నోసార్లు చాలామంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వుంటారు.. అయితే అలా అడిగిన ప్రతిసారి ఏదో ఒక సమాధానం చెప్పే సుబ్బరాజు.. ఈసారి మాత్రం మ్యారేజ్ గురించి మాట్లాడుతూ.. తనకు పెళ్లి ఎందుకు చేసుకోవాలో అర్థం కాలేదని తెలియజేశారు.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుబ్బరాజు పెళ్లి విషయంపై పలు విషయాలను తెలియజేశారు.. వాటి గురించి చూద్దాం.

అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు..
సుబ్బరాజు మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదని.. 25 ఏళ్లు వచ్చాక ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.. అయితే తాను అలా అనుకోలేదని అనుకోవడం కూడా సరికాదని భావించాను తన జీవిత భాగస్వామికి తాను బెస్ట్ ఇవ్వగలను ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలను అని తనకు అనిపించినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటానంటూ సుబ్బరాజు తెలియజేశారు.. అయితే అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయని.. తల్లితండ్రులు ఒత్తిడి కూడా ఉందని పెళ్లి చేసుకోకూడదు అనేది తన ఉద్దేశ్యం కాదని… మనసును ఒక అమ్మాయికి పూర్తిగా ఇవ్వగలను అనే నమ్మకం వచ్చినప్పుడు తాను పెళ్లి గురించి థింక్ చేస్తానంటూ తెలిపారు.

పెళ్లంటే నూరేళ్లపంట..
ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత అది వర్కౌట్ కాకపోతే మరొకటి అన్నది తన మెంటాలిటీ కాదని.. పెళ్లి అనేది ఏదో కారు, ఇల్లు, లాంటిది కాదనీ పెళ్లి అనేది నూరేళ్ళ బంధం వంటిది అంటూ తెలిపారు.అంతేకాదు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి అంటూ తెలియజేశారు సుబ్బరాజు.. గతంలో ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించిన ఈ నటుడు ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు అప్పుడప్పుడు ఈయన నోటి నుంచి వచ్చే డైలాగులు కూడా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాయి.

- Advertisement -

సుబ్బరాజు సినిమాలు..
సుబ్బరాజు ఎప్పుడూ కూడా వైవిధ్యమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. 2003లో ఎంట్రీ ఇచ్చిన సుబ్బరాజు తన మొదటి చిత్రం ఖడ్గం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. ఈయన చేసిన పాత్రలు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలోనే నటించారు. ఒక పక్క కామెడీ పాత్రలు చేస్తూ మరొక పక్క విలన్ పాత్రలు పోషిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు సుబ్బరాజు.. మరిన్ని చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు అంతేకాదు త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నామంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

డ్రగ్స్ కేసులో సుబ్బరాజు..
గతంలో కూడా డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించినప్పుడు తనుకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదని.. దీనివల్ల తన కుటుంబానికి డ్యామేజ్ ఏర్పడిందని చాలా బాధపడ్డాడనని.. ఆ సమయంలో చాలా డిప్రెషన్ కు కూడా వెళ్లిపోయానని తెలియజేశారు సుబ్బరాజు.. ఆ తర్వాత తిరిగి మామూలు మనిషి అవ్వడానికి చాలా సమయం పట్టింది అని కూడా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు