Aadujeevitham : 100 కోట్ల సినిమా అప్పుడే థియేటర్ల నుంచి అవుట్… పృథ్వీరాజ్ కు షాక్

Aadujeevitham : మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు తెలుగు ఆడియన్స్ ఊహించని షాక్ ఇచ్చారు. మలయాళంలో 00 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టిన ఆయన లేటెస్ట్ మూవీ ఆడుజీవితం : ది గోట్ లైఫ్ తెలుగు వెర్షన్ వారం కూడా కాకముందే థియేటర్ల నుంచి అవుట్ అవ్వడం గమనార్హం. మలయాళంలో అదరగొడుతున్న ఈ మూవీకి టాలీవుడ్ లో ఇలాంటి రెస్పాన్స్ రావడానికి కారణం ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే….

టిల్లుగాని దెబ్బకు ఆడుజీవితం అవుట్

బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ఆడుజీవితం సినిమా తెరకెక్కింది. బెన్యా మీన్ రాసిన గోట్ లైఫ్ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. 2009లో అనౌన్స్ చేసిన ది గోట్ లైఫ్ మూవీ 2024లో రిలీజ్ కు నోచుకుంది. 1990వ దశకంలో జీవనోపాధిని వెతుక్కుంటూ అరబ్ దేశానికి వలస వెళ్లిన కేరళ యువకుడి వాస్తవ కథ ఈ మూవీ. నజీబ్ అనే యువకుడి జీవితంలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ది గోట్ లైఫ్ మూవీ తెరపైకి వచ్చింది.

నజీబ్ పాత్రను పోషించడానికి పృథ్వీరాజ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమాని చూశాక పృథ్వీరాజ్ కు నేషనల్ అవార్డు రావడం పక్కా అనే టాక్ నడుస్తోంది. ఈ మూవీలో అమల పాల్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆడుజీవితం మూవీ మార్చ్ 28న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఫస్ట్ డే నుంచి ది గోట్ లైఫ్ తెలుగు వర్షన్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మూవీ ఎలాంటి ట్విస్టులు, టర్న్ లు లేకుండా ఫ్లాట్ గా, స్లోగా ఉందనే విమర్శలు వినిపించాయి.

- Advertisement -

ఇక ఈ మూవీ రిలీజ్ అయిన మరునాడే టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ది గోట్ లైఫ్ మూవీపై గట్టి ఎఫెక్ట్ పడింది. టిల్లు స్క్వేర్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న టిల్లు స్క్వేర్ కు థియేటర్లను కేటాయించడానికి ది గోట్ లైఫ్ మూవీని థియేటర్ల నుంచి ఎత్తేశారు.

100 కోట్ల క్లబ్ లో ది గోట్ లైఫ్

ది గోట్ లైఫ్ తెలుగు వర్షన్ కు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు. ప్రభాస్ లాంటి పలువురు స్టార్ హీరోలతో ఈ సినిమా బాగుందంటూ ప్రమోషన్స్ చేయించారు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ ఈ మూవీ మలయాళ వెర్షన్ ను అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారంతో ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తెలుగులో మాత్రం కోటిలోపే కలెక్షన్స్ దక్కించుకుంది ది గోట్ లైఫ్ ( Aadujeevitham ). సలార్ మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన పృథ్వీరాజ్ దీన్ని అస్సలు ఊహించలేదు. వరద రాజ్ మన్నార్ గా తెలుగు ఆడియన్స్ మన్ననలు అందుకున్న తన నెక్స్ట్ మూవీ ది గోట్ లైఫ్ ను కూడా బాగానే ఆదరిస్తారని ఆశించారు. కానీ ఆయన ఆశలన్ని బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు