Lifestyle : ఈ 5 లక్షణాలు కన్పిస్తే మీకు ఖచ్చితంగా బ్రేక్ కావలసిందే

Lifestyle : ఈ బిజీ ప్రపంచంలో ఒక్కసారి మునిగిపోతే అవసరమైన సమయంలో రెస్ట్ తీసుకోవడం కూడా మరిచిపోతున్నారు జనాలు. పని భారం, బాధ్యతలు ఎక్కువైతే రోజుకు 24 గంటలు కూడా తక్కువే అనిపిస్తుంది మరి. అలాంటప్పుడు ఇంకా రెస్ట్ గురించి ఏం ఆలోచిస్తాము? అని అనుకుంటున్నారా… అయితే బాధ్యతలను నెరవేర్చడం ఎంత ముఖ్యమో విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. దీనివల్ల అలసట తగ్గి క్రియేటివిటీ పెరుగుతుంది.

జీవితంలో ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండాలి అంటే అవసరమైన సమయంలో రెస్ట్ తీసుకోవడం అనేది మస్ట్. అలాగే ఆరోగ్యంగా ఉండడంలో కూడా రెస్ట్ తీసుకోవడం అనేది కీలక పాత్రను పోషిస్తుంది. లేదంటే వ్యక్తిత్వంలో చోటు చేసుకునే అనేక నెగిటివ్ ఛేంజెస్ కారణంగా జీవితంలో ఆనందం అనేది దూరం అవుతుంది. ఈ పరిస్థితి క్రియేటివిటీకి బ్రేకులు వేస్తుంది. కాబట్టి బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి రావాలన్నా, రిఫ్రెష్ ఫీలింగ్ తో పనిని స్టార్ట్ చేయాలన్నా సుదీర్ఘ విరామం అనేది కంపల్సరీ.

మరి ఈ బిజీ లైఫ్ లో రెస్ట్ ఎలా, ఎప్పుడు తీసుకోవాలి ? అంటే కింద ప్రస్తావించబోయే ఐదు లక్షణాలు కన్పిస్తే వెంటనే మీరు సుదీర్ఘ విరామం తీసుకోవాలని అర్థం. మరి ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి అంటే…

- Advertisement -

1. ఫోకస్ చేయడంలో ఇబ్బంది

ఏదైనా ఒక పనిపై పూర్తిగా ఫోకస్ చేయడం అనేది కష్టంగా అనిపిస్తుందా? ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా లేదా మతిమరుపు ఎక్కువైనా నీ మెదడుకు విరామం అవసరం అనడానికి ఇదే తగిన సంకేతం. అలా రెస్ట్ తీసుకోవడంతో పాటు ప్రతిరోజు యోగా చేయడం మొదలు పెట్టండి. యోగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ఫోకస్ ను పెంచుతుంది.

2. మూడ్ స్వింగ్స్

పని చేస్తున్నప్పుడు చిరాకుగా, కోపంగా లేదా నిరాశగా అనిపించడం, ఎమోషన్స్ ను అదుపు చేసుకోలేకపోవడం, ఈజీగా భావోద్వేగానికి గురి కావడం, చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకోవడం వంటివి జరిగితే ఖచ్చితంగా మీకు ఒక బ్రేక్ కావాలని అర్థం. ఈ లక్షణాలు కనిపించాయంటే మెంటల్ గా చాలా వీక్ గా అవుతున్నట్టే. కాబట్టి పరిస్థితి మరింత దిగజారడానికంటే ముందే విశ్రాంతి తీసుకోండి. ఆ సమయంలో మీ ఎమోషన్స్ ను, మీ లక్ష్యాలను గౌరవించే, మీ ఫ్యూచర్ కోసం మిమ్మల్ని ప్రేరేపించే మంచి స్నేహితులను కలవండి.

3. చిన్న చిన్న విషయాలకే కోపం

ప్రతి విషయానికి బాధపడడం లేదా కోప్పడడం వంటివి చేస్తున్నారంటే మీకు రెస్ట్ కావాల్సిందే. అయితే ఇలా ఎమోషన్స్ ను కంట్రోల్ లో పెట్టుకోవాలంటే మానసిక, శారీరక ఆరోగ్యంపై కాన్సన్ట్రేట్ చేయాలి. వీలైనంత వరకు పనిని పక్కన పెట్టి మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి.

4. బలహీనత

శరీరంలో తక్కువ శక్తి ఉన్న ఫీలింగ్ కలిగిందా? ఒక్కోసారి ఇలా అనిపించడం సాధారణమే. కానీ అది తరచుగా జరుగుతోంది. అంటే సమస్య తీవ్రమవుతుందని అర్థం. కళ్ళు భారంగా అనిపించడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మానసికంగా, శారీరకంగా అలసటగా అనిపించడం, ఎనర్జీ కోసం ఎక్కువగా కాఫీలు, టీలు తాగాల్సిన అవసరం వస్తోంది అంటే మీకు విరామం కావాలని అర్థం.

5. డిమోటివేట్ ఫీలింగ్

కనే కలలను నెరవేర్చుకోవడానికి మోటివేషన్ తో ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ సులభమైన పనులు చేయడానికి కూడా మోటివేషన్ అవసరమైతే మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు