Family Star Remunerations : ఫామిలీ స్టార్ కోసం విజయ్, మృణాల్ అన్ని కోట్లు తీసుకున్నారా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీలో రాణిస్తే… మరి కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తున్నారు. అలాంటి హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి… ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. తన కెరీర్ ప్రారంభంలో పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఆ తర్వాత అర్జున్ రెడ్డి తో పెను సంచలనాన్ని సృష్టించాడు విజయ్ దేవరకొండ. అప్పట్లో ఈ సినిమా పెద్ద వివాదానికి దారితీసింది. చాలా రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే అప్పట్లో ఈ సినిమా ఆపేయాలని కాంగ్రెస్ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ కారణంగా సినిమాకు మంచి పాపులారిటీ దక్కింది. దానికి తగ్గట్టుగానే యూత్ కు అర్జున్ రెడ్డి సినిమా నచ్చింది. దీంతో సినిమా బంపర్ హిట్ అయింది.

ఆ తర్వాత గీతగోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో మంచి ట్రాక్ కొనసాగించాడు విజయ్ దేవరకొండ. అయితే టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండకు ఎదురుగాలులు వీస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా అట్టర్ ఫ్లాప్లే కనిపిస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి అలాగే ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా పెద్దగా హిట్ కాలేదు. దీంతో హిట్ కోసం చాలా సతమతమవుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ.

- Advertisement -

వాస్తవానికి హీరో విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆయన సరసన మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా చేసింది. పరశురాం తెరకెక్కించిన ఈ సినిమాలో మృనాల్ తో పాటు దివ్యాంశ కౌశిక్ కూడా మెరిసింది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇందులో జగపతిబాబు, వెన్నెల కిషోర్ అలాగే రోహిణి తదితరులు నటించారు. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించినాడు.

అయితే మొదట్లో ఈ సినిమా బాగాలేదని… కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయని టాక్ వచ్చింది. కానీ ఉగాది పండుగ తర్వాత ఈ సినిమా జోర్ అందుకుంది. 60 నుంచి డెబ్బై కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. ప్రొడ్యూసర్లకు ఎలాంటి నష్టం వాటిల్లది లేదని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన వారి రెమినరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించినందుకు 25 కోట్లు వసూలు చేశాడట. అలాగే దర్శకుడు పరశురాం 15 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇక హీరో అయినా మృనాల్డ్ ఠాగూర్ మూడు నుంచి నాలుగు కోట్లు వసూలు చేసింది అట. అంటే దాదాపు 40 కోట్ల వరకు ఈ ముగ్గురికే ఖర్చు పెట్టాడు నిర్మాత. ఇక మిగతా యాక్టర్లకు గట్టిగానే ఖర్చు అయినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఓటిటి ఫ్లాట్ ఫామ్ లోకి రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాను ఎవరైనా ఆదరిస్తారో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు