VD12 : తమిళ మార్కెట్ పై ఫోకస్… విజయ్ కోసం రంగంలోకి ఇద్దరు కోలీవుడ్ స్టార్స్

VD12 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ VD12పై దృష్టి పెట్టారు. ఈ మూవీతో కోలీవుడ్లో స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇద్దరు తమిళ స్టార్స్ హెల్ప్ తో అక్కడ పాగా వేయడానికి రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి రౌడీ హీరోకు కోలీవుడ్ మార్కెట్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తున్న ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…

విజయ్ కోసం రంగంలోకి ఇద్దరు కోలీవుడ్ స్టార్స్…

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో థియేటర్లలోకి వచ్చిన విజయ్ దేవరకొండకు ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఫ్యామిలీ స్టార్ విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ VD12 పై ఫోకస్ చేశాడు రౌడీ హీరో. ఆయన కెరీర్ లో 12వ మూవీగా రూపొందుతున్న ఈ మూవీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. జెర్సీ సినిమాతో సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గౌతమ్ దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇతర భాషలపై ముఖ్యంగా కోలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవడంపై దృష్టి పెట్టాడు విజయ్ దేవరకొండ.

అందుకే VD12 కోసం మేకర్స్ ఇద్దరు క్రేజీ కోలీవుడ్ సెలబ్రిటీలను రంగంలోకి దింపుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, మరో తమిళ క్రేజీ హీరో విక్రమ్ ప్రభు VD12 మూవీలో క్యామియో రోల్స్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ ఇద్దరు యంగ్ హీరోలు మూవీలో చేసేది గెస్ట్ రోల్స్ అయినప్పటికీ తమిళ తంబీలకు సినిమాపై క్యూరియాసిటీని, అంచనాలు పెంచడానికి ఇది చాలు.

- Advertisement -

డియర్ కామ్రేడ్ తో చుక్కెదురు

ఇక గతంలో కూడా విజయ్ డియర్ కామ్రేడ్ మూవీతో కోలీవుడ్ మార్కెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాత ఈ మార్కెట్ సంగతిని పక్కన పెట్టేసి, ఏకంగా లైగర్ అంటూ పాన్ ఇండియా ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డాడు. అందుకే ఇప్పుడు ఒక్కో వుడ్ పైనా పట్టు సాధించాలనే ప్లాన్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ లో ఎలాగూ ఆయనకు ఊహించని రేంజ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. కాబట్టి VD12తో ఇటు తెలుగులో సాలిడ్ హిట్ కొట్టడంతో పాటు, అటు కోలీవుడ్ లో కూడా స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి వ్యూహం రచిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న ఇద్దరు క్రేజీ హీరోలను ప్రాజెక్ట్ లో భాగం చేసుకుంటున్నారు.

విజయ్ కు ఎమర్జెన్సీ హిట్ కావాల్సిందే

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఒక ఎమర్జెన్సీ హిట్ ను ఇవ్వడానికి ఇటు సితార నిర్మాతతో పాటు, అటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా బాగానే కృషి చేస్తున్నారు. మరి వీళ్ళ ప్రయత్నం ఫలించి విజయ్ దేవరకొండ ఈసారైనా బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడా? ఆశించినట్టుగా ఆ ఇద్దరు హీరోలను ఉపయోగించుకొని కోలీవుడ్ మార్కెట్ ను పక్కాగా క్రియేట్ చేసుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు