Vijay Antony – GV Prakash : అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇప్పుడు హీరోలు.. వార్ మాత్రం తప్పలేదా..?

Vijay Antony – GV Prakash : సాధారణంగా ఒక్కొక్కసారి అనుకోకుండా ఇద్దరు హీరోలు ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటారు.. అయితే ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందో లేక కావాలని పోటీ పడతారో తెలియదు కానీ ఇలా ఇద్దరి మధ్య పోటీ అభిమానులలో పూర్తిస్థాయిలో ఆసక్తిని పెంచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు హీరోగా మారిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏకంగా రెండుసార్లు పోటీ పడడం అంటే ఇది మామూలు విషయం కాదు.. మరి వీరి మధ్య కూడా యాదృచ్ఛికంగా జరుగుతోందో లేక కావాలనే వీరిద్దరూ తమ సినిమాలను బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడి మరీ విడుదల చేస్తున్నారో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్.. ఇప్పుడు హీరోలుగా మారి అందులోనూ తమ సినిమాలను ఒకే టైంలో విడుదల చేస్తూ ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు..? వారి సినిమాలేవి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Vijay Antony - GV Prakash:These music directors became after heros.. fight between them..!
Vijay Antony – GV Prakash:These music directors became after heros.. fight between them..!

విజయ్ ఆంటోని, జీవి ప్రకాశ్ సినిమాలు..

విజయ్ ఆంటోని, జీవి ప్రకాశ్ ఇద్దరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్లు. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారి చేసిన సినిమాలు ఒకే సారి బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. గతంలో 2016లో విజయ్ ఆంటోని హీరోగా విడుదలైన చిత్రం బిచ్చగాడు.. తమిళంలో పిచ్చైకారన్ అనే టైటిల్ తో 2016 మార్చి 4వ తేదీన విడుదల చేయగా తెలుగు అనువాదంలో ఈ సినిమాను అదే ఏడాది మే 13వ తేదీన విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు ఈ సినిమాకి సంగీతాన్ని కూడా సమకూర్చారు.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది..

ఇక ఇదే రోజున మరొక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ హీరోగా మారి నటించిన చిత్రం పెన్సిల్.. ఈ సినిమా కూడా మే 13 2016న విడుదలయ్యింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.. ఇలా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారి ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు ఇక ఆ పోటీలో విజయ్ ఆంటోనీ హీరో గా భారీ సక్సెస్ అందుకున్నారు.. అయితే వీరు ఇప్పుడు మళ్లీ ఒక్క రోజు తేడాతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.. తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన లవ్ గురు చిత్రం ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా.. నిన్న విడుదల కాగా.. ఒక్కరోజు తేడాతో.. జీవి ప్రకాష్ హీరోగా చేసిన DeAr చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ అయింది.

- Advertisement -

దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరూ ఇలా బాక్సాఫీస్ వద్ద పోటీ పడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. వీరిద్దరూ యాదృచ్ఛికంగా తమ సినిమాలను రిలీజ్ చేశారా? లేక కావాలనే రిలీజ్ చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఏది ఏమైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరూ కూడా మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు.. ఇక ఎవరిది పై చేయి అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డ వీరు ఇప్పుడు హీరోలుగా మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. ఎలా అయితేనేమి వీరిద్దరి మధ్య వార్ మాత్రం తప్పడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు