Allu Arjun Upcoming Movie : త్రివిక్రమ్‌ను బన్నీ వదిలేశాడు… ఇక గురూజీకి కష్టమే..!

Allu Arjun Upcoming Movie : అల్లు అర్జున్ గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరైనా, పుష్ప ముందు, పుష్ప తర్వాత అనే స్టార్ట్ చేస్తారు. అంతలా ఆయన కెరీర్‌ను టర్న్ చేసింది పుష్ప మూవీ. పుష్ప పార్ట్ వన్ వల్ల పుష్ప 2 ఎంత ఆలస్యం అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ పై ఉన్న అంచనాల వల్లే ఈ ఆలస్యం. ఈ ప్రెషర్ సుక్కుకు మాత్రమే కాదు, అల్లు అర్జున్‌తో వ్యూచర్‌లో చేయబోయే డైరెక్టర్లకు కూడా ఉంటుంది.

డైరెక్టర్ల కంటే ముందుగా, అల్లు అర్జున్‌కి కూడా ఉంటుందని చెప్పొచ్చు. సినిమా కోసం ఒక డైరెక్టర్‌ను పిక్ చేసుకోవడం అనేది ఈ పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్‌కు ఓ పెద్ద టాస్కే. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మూవీ త్రివిక్రమ్‌‌తో ఉంటుందని టాక్ వచ్చింది. అందుకు త్రివిక్రమ్ స్టోరీ కూడా రెడీ చేశాడని, దీనికి గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్ అని కూడా వార్తలు వచ్చాయి. అవి కేవలం గాసిప్స్ మాత్రమే కాదు, అందులో నిజం ఉంది అంటూ ఇండస్ట్రీలో వర్గాల నుంచి టాక్ వచ్చింది.

అట్లీ పేరు కూడా…

సడన్‌గా అల్లు అర్జున్ లైన్ అప్ లోకి అట్లీ వచ్చి చేరాడు. అట్లీ – అల్లు అర్జున్ – అనిరుధ్ కాంబినేషన్ AAA అంటూ తెగ ట్రెండ్ అయింది. అట్లీ కూడా ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశారట. అనిరుధ్ మ్యూజిక్, అట్లీ డైరెక్షన్‌, అల్లు అర్జున్ యాక్టింగ్, డ్యాన్స్‌తో పాన్ ఇండియా రికార్డులు బ్రేక్ అవుతాయని బన్నీ ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఈ అట్లీ మూవీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే, పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తోనే బన్నీ మూవీ ఉంటుందని సమాచారం వచ్చింది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపిచండం లేదు.

- Advertisement -
Not with Allu Arjun upcoming movie Trivikram
Not with Allu Arjun upcoming movie Trivikram

త్రివిక్రమ్‌‌ను సైడ్ చేశారా…?

పుష్ప ది రూల్ మూవీ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్‌తో కాకుండా, అట్లీతో తన తర్వాత సినిమా చేయాలని బన్నీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ డిసైడ్ అవ్వడంతో అట్లీ కూడా తన పనులు పూర్తి చేసుకుని త్వరగా సెట్స్ పైకి వచ్చేలా చేస్తున్నట్టు టాక్.

గుంటూరు కారం ఎఫెక్ట్‌నా…?

ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కు ఓ పేరుంది. కేవలం నలుగురు హీరోలతోనే సినిమాలు చేస్తాడని అందరూ అంటారు. కొన్ని సార్లు ఫ్లాప్స్ ఇచ్చినా, ఇండస్ట్రీ హిట్ మూవీలను కూడా తెరకెక్కిస్తారు. కానీ, రీసెంట్‌గా మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, మహేష్ కు ఇండస్ట్రీ హిట్ మూవీ అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ, రిలీజ్ తర్వాత గుంటూరు కారం సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చింది. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దీని ఫలితంగానే ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయాల్సిన మూవీ హోల్డ్‌లో పెట్టారు అనే టాక్ వస్తుంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేక పోయినా, బన్నీ తర్వాత మూవీ అట్లీతోనే అని స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు