Tanikella bharani: ‘మరణం’ తప్పక ఆలోచించాల్సిన అవసరం..!

Tanikella bharani.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్న వారిలో నటుడిగా, డైరెక్టర్ గా, రచయితగా తనికెళ్ల భరణి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటారు. రచయితగా కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు తనికెళ్ల భరణి. ఇలాంటి తనికెళ్ల భరణి జీవితంలో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు పలు విషయాలను వెల్లడించారు.

Tanikella bharani: every one has to think about die..!
Tanikella bharani: every one has to think about die..!

తనికెళ్ళ భరణి క్రష్..

ప్రముఖ సింగర్ శ్రావణి భార్గవి యాంకర్ గా మారి.. తాజాగా సీనియర్ దర్శకుడు తనికెళ్ల భరణిని ఇంటర్వ్యూ చేసింది.. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో శ్రావణి భార్గవి కూడా షేర్ చేసింది. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి కూడా పలు విషయాలను తెలియజేశారు.. ముఖ్యంగా తన టీనేజ్ లో లవ్ క్రష్ ఏమైనా ఉన్నాయా అని యాంకర్ అడగగా.. అందుకు తనికెళ్ల భరణి కూడా ఇవి ప్రతివాడికి ఉంటాయి అలాగే తనకు కూడా క్రష్ ఉందంటూ వెల్లడించారు. తాను చదువుకునే రోజుల్లో తన కాలనీలో ఉన్న సమయంలో కొత్తగా వచ్చిన అమ్మాయితో జరిగిన ఒక ప్రేమ కథ అంటూ తెలిపారు..

మరణం పై తనికెళ్ల భరణి కామెంట్స్..

మరణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని యాంకర్ అడగగా.. అందుకు తనికెళ్ల భరణి ప్రతి ఒక్కరు కూడా మరణం గురించి ఆలోచించాలని తెలియజేశారు తనికెళ్ల భరణి.. అది అవసరం అని.. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎలా సంభవిస్తుందో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు నలుగురికి ఉపయోగపడేలా జీవించాలని తెలియజేశారు. చిన్నతనంలో తాను కూడా బాగా అల్లరి చేసే వాడినని.. తను ఎక్కువగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నని అందుకే చాలా అల్లరిగా ఉండే వాడిని అంటూ తెలియజేశారు తనికెళ్ల భరణి.

- Advertisement -

చెట్టుకి కట్టేసి మరీ కొట్టారు..

ముఖ్యంగా స్కూలు ఎగ్గొట్టి మరీ తిరుగుతూ ఉండేవాడిని.. దీంతో తనని చెట్టుకు కట్టేసి మరీ తన తల్లిదండ్రులు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు తనికెళ్ల భరణి.. ఇలా తన చిన్ననాటి జ్ఞాపకాలను సైతం ఒక్కసారిగా తనికెళ్ల భరణి వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనికెళ్ల భరణి పలు చిత్రాలలో.. మంచి మంచి పాత్రలలో నటిస్తూ మరింత క్రేజ్ అందుకుంటున్నారు.

తనికెళ్ల భరణి సినిమాలు..

తనికెళ్ల భరణి సినిమా కెరియర్ విషయానికి వస్తే.. తెలుగులో ఎక్కువగా హాస్య ప్రధాన పాత్రలు పోషించారు.. ఈయనకు సకల కళాకోవిదుడు అనే బిరుదు కూడా ఉంది.. ఇప్పటివరకు సుమారుగా 320 సినిమాలలో నటించిన ఈయన సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటించారు.. ఇటీవలే దూత వెబ్ సిరీస్ లో నటించగా ఈ సీరీస్ మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఇక ఈయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవకుగాను సముద్రం సినిమా కోసం ఉత్తమ విలన్ గా నంది పురస్కారాన్ని అందుకోగా.. 2012లో ఉత్తమ మాటల రచయితగా మిధునం చిత్రానికి మరో నంది అవార్డును అందుకున్నారు. మొత్తానికి అయితే కమెడియన్ గా, రచయితగా, దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు