Aha OTT : ఆహా కూడా మొదలెట్టింది… వాళ్ళకి పండగే ఇక

Aha OTT : రీజనల్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా బోల్డ్ అటెంప్ట్ చెయ్యడానికి రెడీ అవుతోంది. తాజాగా వరుసగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను అనౌన్స్ చేసి ఇకపై కుటుంబ ప్రేక్షకులను మాత్రమే కాకుండా బోల్డ్ మూవీ లవర్స్ ను కూడా తన వైపుకు తిప్పుకునే ప్లాన్ వేస్తోంది. మరి ఆహా ఎందుకింత బోల్డ్ స్టెప్ తీసుకుంది? అంటే…

బోల్డ్ కంటెంట్ పై ఆహా ఫోకస్

మొట్టమొదటి పూర్తిస్థాయి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ గా అల్లు అరవింద్ ఆహాను ఏర్పాటు చేశారు. నిజానికి అల్లు అరవింద్ ఫేస్ మాత్రమే. ఆహాను నడిపించేది మాత్రం మై హోమ్ రామేశ్వరరావు వారసులే. నిజానికి ఇప్పుడు ఆహా సంస్థ ఆఫీస్ కూడా టీవీ9 ఆఫీసులోనే నడుస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే కొన్నాళ్ల క్రిందటి వరకు పూర్తి స్థాయి తెలుగు కంటెంట్ మాత్రమే అందిస్తూ వచ్చిన ఆహా తర్వాత తమిళ వెర్షన్ కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఆహాలు విడుదలయ్యే సినిమాలు, ఇతర వెబ్ సిరీస్ లు కుటుంబ సభ్యులతో కలిసి చూసే విధంగా, అసభ్యతకు తావు లేకుండా ఉండేలా చూసుకునేవారు.

కానీ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పోటీ పడాలంటే మసాలా కంటెంట్ కూడా ఉండాలి అని ఆహా నిర్వాహకులకు అర్థమైనట్టుంది. అందుకే ఈ మధ్యనే మిక్స్ సబ్ అనే ఒక బోల్డ్ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. ఆ సినిమాను మాత్రమే కాదు త్రీ రోజెస్ అనే ఒక వెబ్ సిరీస్ కి సీక్వెల్ వస్తుందని, అది కూడా ఘాటుగా ఉంటుందని హింట్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆహా వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కాస్త ఘాటు వెబ్ సిరీస్ లను, సినిమాలను దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జి 5 లాంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడాలంటే పూర్తి స్థాయి ఫ్యామిలీ కంటెంట్ ఒక్కటే సరిపోదు అని భావించి, ఇప్పుడు బోల్డ్ కంటెంట్ తో రంగంలోకి దిగుతున్నారు. మరి ఆహా వేస్తున్న ఈ బోల్డ్ స్టెప్ కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

ఆహా బోల్డ్ మూవీస్ లిస్ట్

  1. బెంచింగ్ అనే హాటెస్ట్ మూవీని ఆహా అనౌన్స్ చేసింది. ఒకరితో రిలేషన్ లో ఉంటూనే, మరొకటితో సంబంధం పెట్టుకోవడానికి డేటింగ్ ఫ్రెండ్ లో బెంచింగ్ అని పిలుస్తారు. ఈ బోర్డు కాన్సెప్ట్ తోనే బెంచింగ్ మూవీ రూపొందుతోంది.
  2. సిన్ 2… తిరువీర్, బిగ్బాస్ బ్యూటీ దీప్తిసతి ప్రధాన పాత్రలు పోషించిన హాట్ వెబ్ సిరీస్ సిన్ కు సీజన్ 2 రాబోతోంది.
  3. త్రీ రోజెస్ 2… పాయల్ రాజపుత్, ఈశారెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. చాలా రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. బోల్డ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సిరీస్ కు డైరెక్టర్ మారుతీ క్రియేటర్ గా వ్యవహరించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు