Devara to Clash with Rajinikanth : దేవరతో క్లాష్ కు సిద్ధమైన సూపర్ స్టార్

Devara  Clash with Rajinikanth : ఏ ముహూర్తాన తారక్ దేవర మూవీని స్టార్ట్ చేశాడో గానీ అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది. ఇప్పటికే షూటింగ్లో కలిగిన పలు అంతరాయాల వల్ల ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర మూవీ అక్టోబర్ 10 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు స్టార్ హీరోలందరి కళ్ళు అక్టోబర్ పైనే పడ్డాయి. ముఖ్యంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన నెక్స్ట్ మూవీతో దేవరతో బిగ్గెస్ట్ క్లాష్ కు రెడీ అవుతున్నాడు.

దేవర వర్సెస్ వెట్టాయన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 10 రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ అదే తేదీన రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వెట్టాయన్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పై టీం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ చిత్ర బృందం ఇప్పటికే డిస్టిబ్యూటర్లకు అక్టోబర్ 10న వెట్టాయన్ థియేటర్లలోకి రాబోతోందని తెలియజేస్తున్నట్టు సమాచారం.

దేవరతో రజినీకాంత్ పోటీ పడగలరా?

దేవర లాంటి యంగ్ ఫ్యాన్ ఇండియా మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టాయన్ మూవీ పోటీ పడగలదా? అంటే… వెట్టాయన్ మూవీని ఫ్యాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు కోలీవుడ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, టాలీవుడ్ స్టార్ రానా ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో అన్ని భాషల్లోనూ ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే వెట్టాయన్ మూవీని కూడా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయబోతున్నారు. కానీ మరోవైపు దేవర టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర మూవీ అభిమానులందరినీ కాలర్ ఎగరేసేలా చేస్తుందని చెప్పి అంచనాలను మరింతగా పెంచేశారు.

- Advertisement -

ఈ బిగ్గెస్ట్ క్లాష్ తో ఎవరికి నష్టం?

దేవర, వెట్టాయన్ సినిమాల మధ్య క్లాష్ ఏర్పడితే ఎవరికి నష్టం అంటే? అది కచ్చితంగా ఇద్దరికీ అని చెప్పొచ్చు. రజనీకాంత్ కు ఇటు సౌత్ నుంచి అటు నార్త్ దాకా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లోనూ ఆయన మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే వీరాభిమానులు ఉన్నారు. కానీ తెలుగు ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తారక్ కే ఇస్తారు. ఇదే విధంగా తమిళంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ రజినీకాంత్ కే దక్కుతుంది. సౌత్ లో దేవర మూవీపై ఈ క్లాష్ ఎఫెక్ట్ ఎంతో కొంత పడుతుంది. తమిళ, మలయాళ భాషల్లో దేవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ బాలీవుడ్ లో మాత్రం దేవరకే ఎక్కువ సక్సెస్ అయ్యే స్కోప్ ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు