Sayaji shinde: ఆస్పత్రిలో చేరిన నటుడు సాయాజీ షిండే..!!

Sayaji Shinde.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సాయాజీ షిండే.. గతంలో ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించారు. అంతేకాకుండా ఎన్నో చిత్రాలలో సహాయ నటుడుగా కూడా నటించి మెప్పించారు. గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే దూరంగా ఉంటున్నారు సాయాజీ షిండే.. నిన్నటి రోజున ఈ నటుడికి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

 Sayaji Shinde effect by heart attack..!
Sayaji Shinde: Sayaji Shinde effect by heart attack..!

గుండెపోటు బారినపడ్డ సాయాజీ షిండే..
అసలు విషయంలోకి వెళ్తే.. నిన్నటి రోజున సాయాజీ షిండే కు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే వైద్యుల మేరకు కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆయన గుండెలో వేయిన్ బ్లాక్ ఉన్నట్లుగా గుర్తించారట.. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సాయాజి షిండే కు యాంజియోప్లాస్టి చేయించినట్లుగా సమాచారం.. ప్రస్తుతమైతే ఈయన ఆరోగ్యం కుదుటగానే ఉందంటూ వైద్యులు కూడా తెలియజేశారు. దీంతో అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సాయాజీ షిండే డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సర్జరీ అందుకే..
గతంలో కూడా సాయాజీ షిండే కు రెండు మూడు సార్లు ఛాతి నొప్పి వచ్చిందని.. వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం.. మళ్లీ నిన్నటి రోజున ఛాతిలో నొప్పి రావడంతో యాంజియోప్లాస్టి చేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సర్జరీని గడిచిన కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా చేయించుకున్నట్లుగా సమాచారం.. అయితే గుండెను రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అయినప్పుడు వాటిని ఓపెన్ చేయడానికి ఇలాంటి సర్జరీని చేస్తారట. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే కచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందట. అందుకే సాయాజీ షిండే ఈ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.

- Advertisement -

సాయాజి షిండే తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం, మరాఠీ , హిందీ, భోజ్ పురి వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించారు.. తెలుగులో ఈయనకు భారీ క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమాలలో అతడు, పోకిరి, లక్ష్మి, దుబాయ్ శ్రీను , అరుంధతి, దూకుడు, బిజినెస్ మేన్ తదితర చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ సినిమాలలో కనిపించలేదు సాయాజీ షిండే.. అందుకు కారణం ఆయనకు పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సాయాజీ షిండే కెరియర్:
ఈయన కెరియర్ విషయానికి వస్తే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఈయన డిగ్రీ తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్ గా కూడా పనిచేశారు.. అప్పుడు నెల జీతం కేవలం 165 మాత్రమే.. ఉద్యోగం చేస్తున్నా కూడా మనసంతా నాటకాలపైనే ఉండేది.. ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో వ్యాయామం, యోగ అలవాటు చేసుకుని దేహదారుధ్యాన్ని పెంచుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ధార్మియా అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.. అంతేకాదు స్టేట్ అవార్డు కూడా లభించింది. మొత్తానికైతే ఈ పాత్ర తెచ్చిన పేరు ఆయనకు సినిమాలలో మళ్లీ అవకాశాలను అందించేలా చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు