Pushpa -2: భారీ ధరకు అమ్ముడుపోయిన పుష్ప-2 ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లంటే..?

Pushpa -2..అల్లు అర్జున్ కెరియర్ చిత్రాలలో పుష్ప చిత్రం మోస్ట్ వాంటెడ్ చిత్రంగా పేరు సంపాదించింది.. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు.. ఈ చిత్రంతో అటు రష్మిక ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పుష్ప -2 చిత్రం నిలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టుగా సమాచారం.

Pushpa -2: Pushpa-2 audio rights sold at a huge price..?
Pushpa -2: Pushpa-2 audio rights sold at a huge price..?

భారీ ధరకు ఆడియో రైట్స్..
ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా బిజినెస్ హైప్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి నార్త్ సైడ్ భారీ రేంజ్ లో బిజినెస్ ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా సాటిలైట్ డిజిటల్ రైట్స్ విషయంలో కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా పుష్ప-2 ఆడియో హక్కులను..T- సిరీస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. పుష్ప-2 సినిమా ఆడియో రైట్స్ అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.60 కోట్ల మొత్తానికి దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాపై హైప్స్..
గతంలో కూడా పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడానికి ముఖ్య కారణం ఆ సినిమాలోని పాటలే అని కూడా చెప్పవచ్చు . అందుకే ఈసారి పుష్ప-2 సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మరి ఆడియో రైట్స్ ఈ రేంజ్ లో ఉంటే ఇక థియేటర్ బిజినెస్ లెక్క విషయంలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కచ్చితంగా పుష్ప-2 సినిమా థియేటర్లో పూనకాలు తెప్పించేలా ఉంటుందంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ కూడా మ్యూజిక్ ని అద్భుతంగా ఇవ్వబోతున్నారని.. అల్లు అర్జున్ ఈ సినిమాలో మరొకసారి తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప-2 చిత్రాన్ని మరో అద్భుతమైన చిత్రంగా తెరకెక్కించేలా చిత్ర బృందం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి తెలియజేసిన పలువురు సెలబ్రిటీలు కూడా సినిమా పై పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తున్నారు. మొత్తానికి అయితే భారీ కాస్ట్ తో భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

అల్లు అర్జున్ సినిమాలు..
ఇక అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి పుష్ప 2 సినిమాతో నార్త్లో సత్తా చాటి.. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా భారీ క్రేజ్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు