Lifestyle: ఈ అలవాట్లు ఉన్నవాళ్లే స్మార్ట్… మరి మీరు?

స్మార్ట్ అంటే ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడడం, లేదా కష్టమైన లెక్కలను చేయడం మాత్రమే కాదు. మనం ప్రతిరోజూ ఫాలో అయ్యే చిన్నచిన్న అలవాట్లకు సంబంధించింది కూడా. సైకాలజీ ప్రకారం మనల్ని మరింత స్మార్ట్ గా మార్చే కొన్ని రొటీన్ హ్యాబిట్స్ ఉన్నాయి. మరి ఇంతకీ తెలివిని పెంచే ఆ అలవాట్లు ఏంటి? అంటే…

1. పవర్ ఆఫ్ రీడింగ్
తెలివితేటలను పెంచడానికి మంచి బూస్టర్ గా ఉపయోగపడేది రీడింగ్ అంటారు మేధావులు. పుస్తక పఠనం అనేది జ్ఞానాన్ని అందించడమే కాకుండా మనుషులను డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచించే విధంగా చేస్తుంది. చదవడం అనేది మనసుకు మంచి వ్యాయామం లాంటిది.

2. క్యూరియాసిటీ
ప్రశ్నలు అడగడం, సమాధానం వెతకడం, ఓపెన్ మైండ్ కలిగి ఉండడం వల్ల కొత్తగా ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చు. అయితే అంతకంటే ముందు ఇలాంటివి చేయడానికి క్యూరియాసిటీ అనేది ఉండాలి. క్యూరియాసిటీ వల్ల ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోగలుగుతారు. స్మార్ట్ గా ఎదుగుతారు.

- Advertisement -

3. ఫెయిల్యూర్
ఫెయిల్యూర్ అనేది చాలా కఠినమైనది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మిమ్మల్ని స్మార్ట్ గా మార్చే అలవాటు అవుతుంది. ఎన్నిసార్లు ఓడిపోయాం అన్నది కాదు, ఎన్నిసార్లు తిరిగి లేచారన్నదే ఇంపార్టెంట్.

4. మైండ్ ఫుల్ నెస్
స్మార్ట్ గా అవ్వడానికి ఉపయోగపడే మరో మంచి అలవాటు మైండ్ ఫుల్ నెస్ ను ప్రాక్టీస్ చేయడం. మైండ్ ఫుల్ నెస్ వల్ల చేసే పనిలో క్లారిటీ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది.

5. బోర్
బోర్ గా ఫీల్ అవ్వడం కూడా మంచి విషయమే. ఇది ఎలా స్మార్ట్ గా చేస్తుంది అంటే సాధారణంగా బోర్ కొట్టినప్పుడు క్రియేటివ్ ఆలోచనలు, సమస్యలకు పరిష్కారాలు త్వరగా దొరుకుతాయి అనేది సైకాలజీ నిపుణుల మాట.

6. రెగ్యులర్ వ్యాయామం
వ్యాయామం అనేది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

7. నేర్చుకోవడం
నేర్చుకోవడం అనేది కేవలం చదువుతో ముగించేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఇది మనసును చురుకుగా, పదునుగా ఉంచే ఒక నిరంతర ప్రయాణం. ఎలా నేర్చుకోవాలో, జీవితాన్ని ఎలా మార్చుకోవాలో నేర్చుకున్న వ్యక్తి మాత్రమే విద్యావంతుడు అవుతాడు. కాబట్టి వ్యక్తిగత అభివృద్ధి, స్మార్ట్ నెస్ కోసం రెగ్యులర్ గా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి.

8. వదిలేయండి
మీ చేతుల్లో లేని విషయాలను వదిలేయడం నేర్చుకుంటే మీరు స్మార్ట్ గా మారినట్టే. మనం కంట్రోల్ చేయలేని విషయాలను వదిలేస్తేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం.

9. నిద్ర

తగినంత నిద్రపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. అంతేకాకుండా మెదడుకు కూడా మంచిది. ఎంత తక్కువ నిద్రపోతే జీవితకాలం అంత తక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోతే ఆ సమయంలో మెదడు జ్ఞాపకాలను ఒకే దగ్గరకు చేర్చి, టాక్సిన్స్ నుండి తనను తాను శుభ్రపరచుకుంటుంది. నెక్స్ట్ డే కోసం మనల్ని రెడీ చేస్తుంది. నిద్రలేమి వల్ల జ్ఞాపకశక్తి, క్రియేటివిటీ తగ్గిపోతాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు