Surekha Konidela: పవన్, చిరు ఆహారపు అలవాట్లు ఇవే – సురేఖ

మెగా కుటుంబం ఈ స్థాయికి రావడానికి మెగాస్టార్ చిరంజీవి కారణం అయినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవిని ఇంత స్థాయికి ఎదిగేలా చేసింది మాత్రం ఆయన సతీమణి కొణిదెల సురేఖ ని చెప్పవచ్చు.. చిరంజీవి సక్సెస్ వెనుక ఈమె హస్తం ఉంటుందని సందేహం లేదు.. ఇదే విషయాన్ని చిరంజీవి కూడా ఎన్నో సందర్భాలలో గుర్తు చేశారు కూడా.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె నిన్న ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా తన కుటుంబంలో వ్యక్తుల గురించి చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచింది.. ఈ క్రమంలోని చిరంజీవి, పవన్ కళ్యాణ్ యొక్క ఆహారపు అలవాట్లను కూడా అభిమానులకు తెలియజేసింది సురేఖ కొణిదెల..

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు ఇవే..
తాజాగా సురేఖ మాట్లాడుతూ.. చిరంజీవి, కళ్యాణ్ బాబు ఆహారపు అలవాట్లు ఒక్కటే… ఇద్దరికీ భోజనం విషయంలో పెద్దగా డిమాండ్లు ఉండవు.. పచ్చడి మెతుకులు పెట్టినా తృప్తిగా తినేస్తారు.. ఫలానా వంటకాలు కావాలని కోరుకోరు.. ఏది ఉంటే అది తినేస్తారు.. అయితే నాగబాబు కాస్త భిన్నం .. నాగబాబుకి భోజనంలో అన్ని రుచులు ఉండాలి.. ముఖ్యంగా భోజనం విషయంలో మా మామ గారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి.. ఎందుకంటే ఆయన భోజనం చేసేటప్పుడు పద్ధతిగా , చక్కగా తింటారు.. ఆయన తినడం చూస్తే పక్కన వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది..

ఆయనను చూసి వంట నేర్చుకున్నా..
సురేఖ మాట్లాడుతూ.. నేను మా మామయ్య గారిని చూసి వంటలు నేర్చుకున్నాను.. పెళ్లయిన కొత్తలో ఒకసారి ఉప్మా చేశాను.. ఉండలు ఉండలుగా వచ్చింది.. మా మామయ్య వంటలు చాలా బాగా చేస్తారు మామయ్య.. అత్తగారి నుంచి వంటలు నేర్చుకుంటే. నేను ఆయనను చూసి నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సురేఖ కొణిదెల.

- Advertisement -

చిరంజీవి సినిమాలు..
చిరంజీవి సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి బింబిసారా దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు..

పవన్ కళ్యాణ్ కెరియర్..
ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ మరొకవైపు జనసేన అధినేతగా పాలిటిక్స్ లో బిజీగా గడిపేస్తున్నారు..

చిరంజీవి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే..
ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడంలో ఇద్దరూ ముందుంటారు.. ఇద్దరిదీ సహాయం చేసే గుణమే.. అయితే చిరంజీవి కాస్త సౌమ్యుడు అనే అభిప్రాయం సన్నిహితుల నుంచి వినిపిస్తుంది.. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు..ముక్కుసూటి వ్యక్తి.. ఈ విషయంలో ఇద్దరి మధ్య వైవిధ్యం కనిపిస్తుంది.. ఇద్దరు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం చూస్తూనే ఉంటాము.. అలా ఇద్దరి మధ్య పోలికలను, భిన్న అభిప్రాయాలను కూడా వెల్లడించింది సురేఖ. మొత్తానికి అయితే సురేఖ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కోట్లకు అధిపతి అయినా సరే పచ్చడి మెతుకులు కూడా నిరభ్యంతరాయంగా తింటారు అంటూ చెప్పి వారి నిరాడంబరతను మరోసారి గుర్తు చేసింది సురేఖ.. మొత్తానికైతే ఎంత ఎదిగిన అంతే ఒదిగి ఉండాలనే పదానికి చక్కటి నిర్వచనం ఈ మెగా బ్రదర్స్ అనడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు