Relationship Tips : డీప్ గా లవ్ లో ఉన్న అబ్బాయిలు ఇలా బయట పడతారు… తెలీకుండానే…

ప్రేమ అనేది ఒక మత్తు. ఒక్కసారి దానికి అడిక్ట్ అయ్యారంటే తెలియకుండానే ఏవేవో చేసేస్తుంటారు. తమలో తామే నవ్వుకుంటారు. అయితే కొన్నిసార్లు ఇష్టమైన వ్యక్తి ముందు ప్రేమను వ్యక్తపరచడానికి భయపడతారు. అవతల వ్యక్తి రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? వంటి ఆలోచనలతో పాటు ఇతర భయాలు కూడా దానికి కారణం కావచ్చు. కానీ ఒక అబ్బాయి నిజంగానే డీప్ లవ్ లో ఉంటే వాళ్లకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తారు. మరి ఇంతకీ అవేంటి? అనే విషయంలోకి వెళ్తే…

1. చిన్న చిన్న విషయాలను గుర్తు పెట్టుకోవడం
సాధారణంగా మనం పట్టించుకోని వ్యక్తుల గురించిన చిన్న చిన్న విషయాలను అస్సలు గుర్తుపెట్టుకోము. కానీ ఎవరినైనా పిచ్చిగా ప్రేమించినప్పుడు వాళ్ల గురించి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకొని గుర్తు పెట్టుకుంటారు.

2. మాట వినడం
గాఢంగా ప్రేమలో ఉన్న అబ్బాయిలు తమ లవర్ చెప్పే మాటను వింటారు. ఇది కేవలం వినడం మాత్రమే కాదు తను ఇష్టపడే అమ్మాయికి మర్యాదను ఇవ్వడం, వాళ్ల భావోద్వేగాలను నిజంగా అర్థం చేసుకోవడం కూడా. కాబట్టి నిజంగా ప్రేమలో ఉన్న అబ్బాయి తనకు ఇష్టమైన అమ్మాయి ఏదైనా చెప్తే ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా వెంటనే చేసేస్తాడు.

- Advertisement -

3. సహనం
సహనం అనేది తన లవర్ పట్ల అబ్బాయి కున్న డీప్ లవ్, గౌరవానికి నిదర్శనం. అంటే అతను ఆమెను అర్థం చేసుకుంటున్నాడు, ఓపికగా ఉంటున్నాడు. తన పిల్లకు అవసరమైన స్పేస్ ఇవ్వడానికి, టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటాడు.

4. ప్రేమ
నిజంగా డీప్ లవ్ లో ఉన్న అబ్బాయి తమకు తెలియకుండానే ఇష్టమైన అమ్మాయి చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తారు. అంటే మాటల్లో చెప్పకుండా పిచ్చిగా ప్రేమలో ఉన్నామని చెప్పడానికి ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. ఈ రకమైన శారీరక సాన్నిహిత్యం ఆప్యాయత, ఓదార్పు, భరోసాను ఇవ్వడమే కాకుండా ఇద్దరి మధ్య మంచి భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది.

5. షేరింగ్
ఎవరికైనా హాబీస్ అనేవి పర్సనల్. కానీ అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు తమ లవర్ తో హాబీస్ గురించి చెప్పేస్తాడు. అంటే అతని ప్రపంచాన్ని తనకు ఇష్టమైన అమ్మాయి ముందు ముందు ఉంచుతున్నాడు అన్నమాట. అలాగే ఆ అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించి, తనతో మరింత స్ట్రాంగ్ గా కనెక్ట్ కావాలని చూస్తున్నట్టు.

6. బలహీనతలు బయట పెట్టడం
పిచ్చిగా ప్రేమలో ఉన్న అబ్బాయి ఇష్టమైన అమ్మాయి ముందు ఏదో ఒక సమయంలో తన బలహీనతలను బయట పెట్టేస్తాడు. సాధారణంగా అబ్బాయిలు తమ వీక్నెస్ గురించి బయట పెట్టడానికి ఇష్టపడరు.

7. సపోర్ట్
అమ్మాయి ఏం చేసినా సరే అబ్బాయి సపోర్ట్ ఇస్తున్నాడు అంటే అతను డీప్ లవ్ లో ఉన్నట్టే. ఎందుకంటే అబ్బాయిలు లవ్ లో ఉన్నప్పుడు తమ లవర్ కలలు, లక్ష్యాలు, సవాళ్లు కూడా తమ సొంతంగా, ముఖ్యమైనవిగా భావిస్తారు. అబ్బాయిలు డీప్ లవ్ లో ఉంటే తమకు తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తారన్న మాట.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు