Tamannaah Breakup: చాలా పెయిన్‌గా ఉంది – తమన్నా షాకింగ్ కామెంట్స్ !

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ పెయిర్ తమన్నా – విజయ్ వర్మ. దాదాపు 18 ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తమన్నాకు ఇటీవల గడ్డు కాలం వచ్చింది. అవకాశాలు రాక సతమతమైంది. వెంటనే నో కిస్సింగ్ పాలసీకి బ్రేక్ చెప్పేసి, విజయ్ వర్మతో హద్దులు దాటి లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ చేసి, మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. అప్పటి నుంచి తమన్నా కెరీర్ మళ్లీ గాడిలో పడిందని చెప్పొచ్చు.

ఇక తమన్నా – విజయ్ వర్మ ప్రస్తుతం తమ రిలేషన్ షిప్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టైం దొరికితే నైట్ పార్టీలు, డిన్నర్‌లు, వెకేషన్స్ వెళ్తూ చట్టా పట్టాలేసుకుని బీ టౌన్ మొత్తం తిరిగేస్తున్నారు. అలాగే ఇటీవలే మాల్డీవుల వెకేషన్ కి వెళ్లిన ఈ జంట అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రత్యేక్షమవుతున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు తమన్నా – విజయ్ వర్మ రిలేషన్ షిప్స్ పై కొత్త అనుమానాలు వస్తున్నాయి.

ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. “మనుషులు చాలా రకాలుగా మాట్లాడుతారు. కానీ మనకు దగ్గరైన మనుషులు కూడా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు, అవి వినప్పుడు చాలా పెయిన్‌గా ఉంటుంది” అంటూ చెప్పింది. అలాగే “ఈ మాటల వల్ల మనకు దగ్గరైన వాళ్లు ఏం అనుకుంటారో మనకు తెలిసిపోతుంది” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ కామెంట్స్ ని విజయ్ వర్మను ఉద్దేశించి తమన్నా చేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

తమన్నాపై వచ్చే రూమర్స్ ను విజయ్ వర్మ సీరియస్ గా తీసుకున్నాడని, అంతే కాకుండా, వీటిపై తమన్నాను నిలదీసాడని అంటున్నారు. అందుకే తమన్నా హార్ట్ బ్రేక్ అయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అలాగే మాల్డీవుల వెకేషన్ లో కూడా తమన్నా – విజయ్ వర్మ మధ్య తీవ్రమైన మనస్పర్థాలు వచ్చాయని కూడా వార్తలు వస్తున్నాయి. వీటి అన్నింటినీ చూస్తే తమన్నా – విజయ్ వర్మ జంట త్వరలోనే విడిపోనుందని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు