Salaar Ceasefire: ప్రభాస్ బాటలోనే సిద్ధు జొన్నలగడ్డ… టాలీవుడ్‌కి అసలేమైంది?

Salaar Ceasefire

టాలీవుడ్‌కి అసలేమైంది? ప్రస్తుతం జరుగుతన్న పరిస్థితులను చూస్తే ఈ ప్రశ్న తప్పక వస్తుంది. సినిమాలు స్టార్ట్ అయ్యే టైంలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఓ టార్గెట్ పెట్టుకుని ఆ లోపే సినిమాలను రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని చిత్ర యూనిట్ అలా పని చేస్తోంది. అయితే ఇది చాలా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఎక్కువ శాతం, సినిమా దాదాపు సగం మేర పూర్తి అయ్యాకా, మిగితా సగం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను అంచనా వేసుకుని మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం అన్ని సినిమాలు చేస్తుంది ఇదే పని. అయినా, 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్నా, మేకర్స్ ఆ డేట్ లో సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇటీవల ప్రభాస్ సలార్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. నిజానికి చాలా రోజుల క్రితమే సలార్ వాయిదాపై వార్తలు వినిపించాయి. 400 కోట్ల బడ్జెట్ మూవీకి రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా, ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదే అంటూ రిలీజ్ డేట్ వాయిదాపై అనుమానాలు వచ్చాయి.

తాజాగా సీజీ వర్క్ లో ఆలస్యమైంది అంటూ వాయిదా వార్తలు రానే వచ్చాయి. తాజాగా ఈ నెలలో రిలీజ్ కావాల్సిన మరో సినిమా కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అదే యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న టిల్లు స్క్వేర్. ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. హీరోయిన్ విషయంలో జరిగిన గందరగోళం అంతా ఇంత కాదు.

- Advertisement -

ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. ఇప్పుడు రిలీజ్ డేట్ పై అనుమానాలు. ఈ మూవీని ఈ నెల 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్ . అంటే ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఇంకా మూవీ నుంచి టీజర్ గానీ, సాంగ్స్ గానీ, ట్రైలర్ గానీ, రాలేదు. ప్రమోషన్ పనులు కూడా స్టార్ట్ చేయలేదు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే, టిల్లు స్క్వేర్ కి కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యమవుతుందట. దీంతో 15వ డేట్ నుంచి సినిమాను వాయిదా వేయడం తప్పా.. మరో ఆలోచన లేదని తెలుస్తోంది. వాయిదాపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకనట చేసే ఛాన్స్ ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు