Krishna Vamsi: ఆ హీరోయిన్ ని బెడ్ రూమ్ సీన్ ను అలా వాడేసిన కృష్ణవంశీ..!

Krishna Vamsi

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ సినిమాలను రూపొందించిన దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తొలి చిత్రం గులాబీతో మొదలుకొని కృష్ణవంశీ చేసిన ప్రతి చిత్రం ఒక ఆణిముత్యమే. నిన్నే పెళ్లాడతా, సింధూరం అంతపురం, ఖడ్గం, రాఖీ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ అనే పుస్తకంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకోగలిగాడు కృష్ణవంశీ. ఆయన ఇప్పటివరకు చేసినవి 21 సినిమాలు అయినా తన ఖాతాలో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో జాతీయ సమగ్రత భావంతో తెరకెక్కించిన చిత్రం ఖడ్గం. ఈ చిత్రానికి నంది అవార్డులు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమా కొంతమందికి నచ్చలేదన్న చర్చలు కూడా అప్పట్లో నడిచాయి. అప్పట్లో ఈ సినిమా తెరకెక్కించిన సమయంలో కృష్ణవంశీకి బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాలో రవితేజ కి జోడిగా సంగీత హీరోయిన్ గా నటించింది. గతంలో సినిమా రంగంలో అవకాశాల కోసం హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వస్తే దర్శకులు, హీరోలు ఎలా వాడుకున్నారు అనే అంశాన్ని సంగీత పాత్ర ద్వారా ప్రేక్షకులకు చక్కగా చూపించారు కృష్ణవంశీ.

అయితే ఈ పాత్ర అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ దర్శకుడు హీరోయిన్లను ఏలా వాడుకున్నాడు అని సినీ రంగంలో కృష్ణవంశీకి ఎదురైన అనుభవాల ఆధారంగా సంగీత పాత్రను చక్కగా వాడుకున్నారు కృష్ణవంశీ. ఈ పాత్ర ద్వారా ఇండస్ట్రీలో తెర వెనక తతంగాలను బయటపెట్టారని అప్పట్లో ఆయనను అందరూ మెచ్చుకున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు