క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుండి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నానా పాటేకర్ మలయాళంలో టైటిల్ రోల్ పోషించిన ‘నట సామ్రాట్’ కు రీమేక్. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు కానీ.. ప్రమోషన్స్ ను మాత్రం ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నాడు కృష్ణవంశీ. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ వంశీ తన కెరీర్ లో పెద్ద ప్లాప్ గా నిలిచిన ‘చక్రం’ సినిమా రిజల్ట్ గురించి స్పందించాడు. ఈ చిత్రం ఫలితం అలా అవ్వడానికి ప్రభాసే కారణం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కృష్ణవంశీ.
ఎందుకంటే.. ‘చక్రం’ కి ముందు ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు రెండు కథలు వినిపించాడట కృష్ణవంశీ. ఒకటి ‘చక్రం’ కాగా.. మరొకటి రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఇందులో ప్రభాస్ ‘చక్రం’ సెలెక్ట్ చేసుకున్నాడట. ‘ప్రతీ దర్శకుడు తనకు యాక్షన్ కథలే చెబుతున్నారని, పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న ఇలాంటి సినిమా చేయాలని ఉందని’ ప్రభాస్ చెప్పాడట. అలా కాంప్రమైజ్ కాకుండా ‘చక్రం’ చేయడం, అది ఫ్లాప్ అవ్వడం జరిగింది అని కృష్ణవంశీ తెలిపాడు. ‘దానికి బదులు యాక్షన్ సబ్జెక్ట్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది అని’ ఈ సందర్భంగా కృష్ణవంశీ తెలిపారు.