Ntr – Buchibabu: అదంతా ఫేక్

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తయ్యాక ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా ఉంటుంది అని ప్రచారం జరిగింది. కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ 31వ చిత్రంగా ప్రశాంత్ నీల్ మూవీ రూపొందనుంది అని అధికారిక ప్రకటన వచ్చింది.దీంతో బుచ్చిబాబు సినిమా లేదేమో అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఇటీవల ఎన్టీఆర్.. బుచ్చిబాబు కి ఓ ఐడియా ఇచ్చాడని, లవ్ ట్రాక్ తన ఇమేజ్ కు తగ్గట్టు మార్చుకుని తీసుకురమ్మన్నాడు అని ఓ వార్త హల్ చల్ చేసింది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్.. బుచ్చిబాబు కథకి ఎటువంటి వంకలు పెట్టలేదట.బుచ్చిబాబు కథని ఎన్టీఆర్ ఎప్పుడో లాక్ చేశాడని… ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది అని తెలుస్తోంది.సాధ్యమైనంత వరకు కొరటాల శివ తో సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని ఎన్టీఆర్ సన్నిహిత వర్గం చెబుతుంది. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బుచ్చిబాబు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అని కూడా ఇన్సైడ్ టాక్. ‘నాన్నకు ప్రేమతో’ టైంలో ఎన్టీఆర్ కు బుచ్చిబాబు బాగా క్లోజ్ అయిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు