విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి, గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాలేం లేవు. కాని ఈ రౌడీ బాయ్ యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేస్కున్నాడు. గీతగోవిందం విజయం తర్వాత దర్శక నిర్మాతలు అతనిని ఒప్పించడానికి క్యూలు కట్టేసరంటే అతిశయోక్తి లేదు.
వరల్డ్ ఫేమస్ లవర్ అనుకున్నంత విజయం అందుకోలేకపోయిన విజయ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తరువాత పూరి జగన్నాథ్ తో లైగర్ మొదలు పెట్టి అందర్ని షాక్ చేసాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఒక చిత్రం పట్టలేక్కబోతుంది అని కుడా ఒక వార్త వచ్చింది. అయితే ఇప్పుడు పూరి తోనే వరసగా రెండో సినిమాని ఒకుడా ఒకే చేసేసి లైగర్ విదుదల కాకముందే జనగణమన చిత్రం ఒకే ముంబై లో మొదలు పెట్టేసాడు.
లైగర్ ఖరారు అవ్వకముందే అనుకున్న సుకుమార్ చిత్రం ఇప్పుడు ఏమైందో ఎవ్వరికి తెలియడం లేదు. సుకుమార్ పుష్ప-2 చిత్రం లో బిజీ గా ఉన్నాడని విజయ్ పూరితో జనగణమన మొదలు పెట్టేసాడ?? లేదా విజయ్ కి సుక్కు కి ఎమన్నా చెడిందా?? అనే విషయాలు తెలియాల్సి ఉంది.