శ్రీ రామనవమి సందర్బంగా హరిహరవీరమల్లు పోస్టర్ విడుదల!

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రం అనగానే పవన్ అభిమానుల్లోనే కాకుండా మొత్తం చిత్ర వర్గాల్లో ఒక పండగ వాతావరణం మొదలయ్యింది. చాల కాలం క్రితమే ఈ చిత్రం షూటింగ్ మొదలు అయ్యింది. కాని మధ్యలో కరోన కారణం గా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు పరిస్థితులు కొంచెం మెరుగు పడ్డం వల్ల దర్శక నిర్మాతలు షూటింగ్ పనులు మొదలు పెట్టారు.

మొన్నీమధ్య విదుదల చేసిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిర్మాణాత్మక విలువలకు ఏ మాత్రం వెనకాడకుండా భారి వ్యయం తోనే ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ కి పని చేసిన ఫైట్ చేసిన స్టంట్ మాస్టర్ ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్న, ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు