భయపడిపోతున్న రాం చరణ్ !! కారణం ఏంటి?

హీరోగానే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్త గా కూడా రామ్ చరణ్ తనని తాను ఎప్పుడో నిరూపించుకున్నాడు.  రాం చరణ్ కి పోలో జట్టు, ప్రముఖ విమానయాన సంస్థలో భాగం, అలాగే ప్రముఖ హాస్పిటల్ చైన్ లో వాటా లు కుడా ఉన్నాయని  సమాచారం. 

అడపాదడప ఏవరేజ్ లు ఒకటో రెండో ఫ్లాపులు పడ్డా కుడా ఆర్ ఆర్ ఆర్ తో అవన్ని తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడున్న హీరోలలో రామ్ చరణ్ చాల మేలు అనే అంటున్నారు దర్శక నిర్మాతలు. 

అయితే, తన సొంత నిర్మాణ సంస్థ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డట్టు సమాచారం.  తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తో పాటే ఈ కొణిదెల ప్రొడక్షన్స్ ని కూడా ఘనంగా లాంచ్ చేసాడు. ఖైది నెం 150 బాక్స్ ఆఫీస్ వద్ద భారి విజయాన్ని సాధించి, ఈ ప్రొడక్షన్ హౌస్ కి శుభారంబాన్ని అందించింది. 

- Advertisement -

ఆ తర్వాత వచ్చిన చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన సైర నరసింహారెడ్డి కుడా బాగానే రాణించినా, ఆ చిత్రానికి పెట్టిన బడ్జెట్ కి వచ్చిన వసుల్లకి పొంతన లేకపోవడం తో నష్టాల్లోకి వెళ్ళినట్లు సమాచారం. 

ఇప్పుడు ఆచార్య తో మూడో చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్ పెద్ద ఇబ్బందుల్లోనే ఉంది అని వినికిడి.మొన్నామధ్య మిషన్ ఇంపాసిబుల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన చిరంజీవి మాటల మధ్యలో పొరపాటున ఆచార్య చాల స్లో గా ఉంది అనేశారు.  అందుకేనేమో ఈ చిత్రం అన్ని పూర్తి చేస్కున్నా, దర్శక నిర్మాతల చెక్కుడు కారణంగా వాయిదాలు పడుతూ వస్తుంది.  దీని తర్వాత గాడ్ ఫాదర్ అనే చిత్రాన్ని కూడా చరణ్ నిర్మిస్తున్నారు. 

ఈ తలనోప్పులన్ని పడేకన్నా ప్రొడక్షన్ పనులనుండి తప్పుకోవడం సుఖం అనుకున్నదేమో, ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్ భాద్యతలన్నీ  సుష్మిత కొనిదేలకి ఇవ్వనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు