Vishwak Sen : విశ్వక్ రిజక్ట్ చెయ్యలేదు, విశ్వక్ ను రిజక్ట్ చేసారు

Vishwak Sen : ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకరు. వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఈ సినిమాలో వివేక్ పాత్రలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత దర్శకుడుగా కూడా తన టాలెంట్ బయటకు తీశాడు.

విశ్వక్ దర్శకత్వం వహించిన ఫలక్నామ దాస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా విశ్వక్ లో ఇంత గొప్ప టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసింది ఫలక్నామా దాస్ సినిమా. విశ్వక్సేన్ చేసిన డైరెక్షన్ అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ సినిమా తర్వాత పలు వైవిధ్యమైన సినిమాలు ఎన్నుకుంటూ కెరియర్ లో ముందుకెళ్లాడు. అలానే దమ్కీ అని సినిమా కూడా దర్శకత్వం వహించాడు విశ్వక్.

విశ్వక్ ఎప్పుడు కాంట్రవర్సీ కి దగ్గరగా ఉంటాడని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలక్నామా దాస్ సినిమా అప్పుడు విశ్వక్ చేసిన స్టేట్మెంట్ ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో నన్ను ఎవడూ లేపాల్సిన పనిలేదు నన్ను నేనే లేపుకుంటా అన్నాడు విశ్వక్. అయితే అందరూ విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి కామెంట్ చేసారని అప్పట్లో రాసుకోచ్చారు. తర్వాత తన వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చాడు విశ్వక్.

- Advertisement -

ఇక రీసెంట్ గా గామి అనే సినిమాను చేశాడు. అయితే ఈ సినిమాతో పాటుగా మలయాళం డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాకి చాలా మంది సెలెబ్రిటీస్ అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే అదే తరుణంలో ఈ సినిమాలో మా సినిమాను కూడా ఒక నలుగురు పెద్దలు చూసి ప్రమోట్ చేస్తే బాగుంటుంది అంటూ చురకలు అంటించాడు.

ఇక అసలు విషయానికి వస్తే విశ్వక్సేన్ ( Vishwak Sen ) యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ బర్త్డే సందర్భంగా ఒక ర్యాప్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. అలానే ఆహా నిర్వహించిన అన్ స్టాపబుల్ అనే షోకి గెస్ట్ గా కూడా హాజరైన విషయం తెలిసిందే అక్కడ బాలయ్యతో మంచి బాండింగ్ కుదిరింది. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109 వ సినిమాను చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో బాలయ్య 109 లో సెకండ్ హీరో పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందట. ముందు ఈ పాత్రను నాని చేస్తున్నట్టు టాక్ వచ్చింది.

కానీ, మేకర్స్ అసలు నాని ని కాంటాక్ట్ అవ్వలేదు. దుల్కర్ సల్మాన్ ను అనుకున్నారు. కానీ, నాగవంశీ ఇప్పటికే దుల్కర్‌తో లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నాడు. అందు వల్ల హోల్డ్ లో పెట్టారు. చివరిగా విశ్వక్ సేన్ ను అనుకున్నారు. కానీ, తర్వాత అ పాత్ర విశ్వక్ కు సెట్ అవ్వదని వద్దు అనుకున్నారు.కానీ, విశ్వక్ దీన్ని మైలేజ్ కోసం వాడుకున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తనకు వాల్తేరు వీరయ్యలో రవితేజ లాంటి పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ, దాన్ని తాను రిజెక్ట్ చేశాను అని చెప్పుకున్నాడు. కానీ, విశ్వక్ నే మూవీ టీం రిజెక్ట్ చేశారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు