NBK109 : పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు?

నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ల తర్వాత బాబీ కొల్లి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఆరు నెలల కింద మొదలైన ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేసారు. కానీ బాలయ్య పాలిటిక్స్ బిజీ వల్ల ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. అందుకే బాలయ్యకి అనుకూలంగానే ఈ సినిమా వీలున్నప్పుడు షూటింగ్ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన NBK109 సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఈ టీజర్ లో మండుతున్న అడవిలో బాలయ్యని స్టైలిష్ యాక్షన్ మోడ్ లో చూపించిన బేబీ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాడు.

భారీ తారాగణం.. దసరా విలన్ ఎంట్రీ?

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ ఒక్కొక్కరిగా పెరిగిపోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా అనిమల్ విలన్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. రీసెంట్ గా సెట్స్ లో కూడా అడుగుపెట్టాడు బాబీ డియోల్. ఇక లేటెస్ట్ గా ఒక మలయాళ విలక్షణ నటుడు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని సమాచారం వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ‘షైన్ టామ్ చాకో’ ను ఓ కీలక పాత్రకు మేకర్స్ ఎంపిక చేశారట. నాని ‘దసరా’లో షైన్ టామ్ చాకో విలన్ గా తన నటనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాగశౌర్య ‘రంగబలి’ సినిమాలోనూ ఆయన విలన్‌ గా నటించడం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ బాబీ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. ఇక బాలకృష్ణ సినిమా తెలుగులో విలన్‌గా ఆయనకు హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ అనుకోవచ్చు.

- Advertisement -

దుల్కర్ సల్మాన్.. గౌతమ్ మీనన్..

ఇక బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతుండగా, ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారట. ఇప్పటీకే మహానటి, సీతారామం సినిమాలతో తెలుగువారికి చేరువయ్యాడు దుల్కర్. అంతే కాదు. స్టార్ డైరెక్టర్, నటుడు అయిన గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ నుండి వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే బాలకృష్ణ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న స్టార్ నటుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎంపికయ్యారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లేటెస్ట్ గా టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తుంది.

పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ ?

అయితే NBK109 సినిమా బడ్జెట్ మాత్రం రోజురోజుకి పెరిగిపోతుందని సమాచారం. ఇంత మంది స్టార్ క్యాస్ట్ ని పెడితే బడ్జెట్ కూడా లిమిట్ దాటిపోతుందని ఎవరైనా చెప్పగలరు. అయితే ఎంత హ్యాట్రిక్ హిట్లు కొట్టినా బాలయ్య మార్కెట్ పరిధి టాలీవుడ్ ని దాటలేదు. పైగా వంద కోట్ల సినిమాకూడా లేదు. కానీ బడ్జెట్ చూస్తుంటే 80 కోట్లు దాటిపోతుందట. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ భాషల్లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కానీ ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు