Kiran Abbavaram : గ్రాండ్ గా రాజావారితో రాణివారి నిశితార్థం..

టాలీవుడ్ లో టాలెంట్ ని నమ్ముకుని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా నిలదొక్కుకుని ఇప్పుడు ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసి వాటితో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. “రాజావారు రాణిగారు” అనే చిన్న సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ కొట్టాడు. చిన్న బడ్జెట్ తో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అవడంతో పాటు, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది . ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రహస్య గోరక్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా నుండే వీరి రీల్ లైఫ్ లవ్ రియల్ లైఫ్ లవ్ గానూ మారింది. వివరాల్లోకి వెళితే..

రాజావారు రాణి గారు సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఎస్సార్ కళ్యాణ్ మండపం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత కిరణ్ సరైన హిట్ సినిమాను ఇప్పటివరకు చేయలేదు. ఆ మధ్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయినా కిరణ్ తర్వాత చేసిన సినిమాలు మళ్ళీ ప్లాపుల బాట పట్టాయి. మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. అయితే ఇండస్ట్రీ లో తన వ్యక్తిగత గుర్తింపుతో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు కిరణ్. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉంచాడు.

కిరణ్ రహస్య ఎంగేజ్మెంట్..

- Advertisement -

అయితే కిరణ్ అబ్బవరం చాలా రోజులుగా నడిపిన ‘రహస్య’ ప్రేమాయణం తాజాగా అందరికి రివీల్ చేయడం జరిగింది. రాజావారు రాణివారు లో తన హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ తోనే తాను ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. ఇక రీసెంట్ గా తొందర్లోనే వీరు నిశితార్థం చేసుకోబోతున్నారని వార్తలు రాగా, అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా అయిపొయింది. బుధవారం నాడు బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగగా, చాలా ప్రైవేట్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎటువంటి ఆర్భాటాలకు వెళ్లకుండా, చాలా తక్కువ మంది గెస్ట్ లతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం, రహస్యల ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు అయితే నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇక ఎంగేజ్మెంట్ తర్వాత వెంటనే కమిట్మెంట్లను పూర్తి చేసి, సినిమాలన్నీ కంప్లీట్ చేసి పెళ్లి పీటలపై కూర్చోనున్నాడు. ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఓ పీరియాడిక్ డ్రామాను, అలాగే ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తున్నాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు