Kiran Abbavaram: రాణి గారిని పెళ్ళి చేసుకోబోతున్న రాజావారు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమను తాము ప్రూవ్ చేసుకొని సొంతంగా నిలద్రొక్కుకొని హీరోగా తమకంటూ కొంత గుర్తింపు సాధించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేసి, షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపును సాధించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.

కిరణ్ నటించిన రాజావారు రాజా గారు రాణి గారు సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. అయితే చాలా తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. మంచి హిట్ అవడంతో పాటు విమర్శకులు ప్రశంసలను కూడా అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రహస్య గోరక్ హీరోయిన్ గా నటించింది.

రాజావారు రాణి గారు సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన సినిమా ఎస్సార్ కళ్యాణ్ మండపం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. కోవిడ్ టైం లో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అయితే ఈ సినిమాతోనే కిరణ్ అబ్బవరంలో ఉన్న రైటర్ కూడా బయటకు వచ్చాడని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత కిరణ్ సరైన హిట్ సినిమాను ఇప్పటివరకు చేయలేదు.

- Advertisement -

ఈ సినిమా తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సెబాష్టియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత చేసిన సమ్మతమే సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” సినిమా కూడా ఊహించిన విజయాన్ని సాధించలేదు. అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ పాలు అయింది. ఆ తర్వాత చేసిన మీటర్, రూల్స్ రామానుజన్ సినిమాలో అంతంత మాత్రమే ఆడాయి.

అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా హిట్ అయిన తర్వాత వరుస అవకాశాలు రావడంతో అన్నిటికీ సైన్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు కిరణ్. అయితే కరెక్ట్ గా టైం దొరక్క కెరియర్ సరిగ్గా ప్లాన్ చేసుకోక వరుస డిజాస్టర్స్ చూశాడు. ఇకపోతే కిరణ్ అబ్బవరం హిట్ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ తరుణంలో కిరణ్ ఒక ఇంటివాడు అవుతున్నట్లు తెలుస్తుంది. తనతో మొదటి సినిమాలో నటించిన రహస్య గోరకను కిరణ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే వీరిద్దరికీ బుధవారం ఎంగేజ్మెంట్ జరగనుందని త్వరలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. దీని గురించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నాడు కిరణ్.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు