Tollywood Comedians: హీరోలుగా మారి ఫెయిల్యూర్ గా నిలిచిన స్టార్ కమెడియన్స్..!

సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో చాలామంది కమెడియన్లు హీరోలుగా ట్రై చేశారు.. అయితే అందరూ సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.. ఇకపోతే ఈ విషయంలో కొంతమంది తెలివిగా ఆలోచించి కెరియర్ కాపాడుకుంటే.. మరి కొంతమంది అత్యాశకు పోయి కెరియర్ నే నాశనం చేసుకున్నారు.. అలా ఒకప్పుడు స్టార్ కమెడియన్లుగా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత హీరోలుగా మారి సక్సెస్ కాలేక కెరియర్ నే కోల్పోయిన స్టార్ కమెడియన్స్ కొంతమంది అయితే.. మరికొంతమంది హీరోలుగా సక్సెస్ కాలేక విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా సెటిల్ అయ్యారు.. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అలీ..
స్టార్ కమెడియన్ అనగానే బ్రహ్మానందం తర్వాత గుర్తొచ్చే పేరు అలీ.. అప్పుడప్పుడు హీరోగా చేశారు. కానీ హీరోగా కాకుండా కామెడీనే అద్భుతంగా పండించారు.. అటు కామెడీ పాత్రలు , ఇటు హీరో పాత్రలు రెండూ చేశారు కానీ కమెడియన్ గా సూపర్ సక్సెస్ అయి కంప్లీట్ గా హీరోగా మారి అట్టర్ ప్లాప్ అయ్యారు.. దాంతో ఇప్పుడు టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

సునీల్:
కమెడియన్ గా మంచి కెరియర్ కొనసాగిస్తున్న సమయంలో హీరోగా మారారు సునీల్.. పూలరంగడు సినిమాతో హీరోగా కెరియర్ మొదలుపెట్టిన సునీల్ మర్యాదరామన్న సినిమాతో ఆగిపోయి ఉంటే బాగుండేది కానీ ఆయన హీరోగా కంటిన్యూ అయ్యి సిక్స్ ప్యాక్ తో, యాక్షన్స్ సినిమాలతో హీరో అనిపించుకుందాం అనుకున్నాడు.. కానీ హీరోగా కోలుకోలేని ఎదురు దెబ్బ తిన్నాడు.. ఇప్పుడు కమెడియన్ గా చేయాలన్నా .. బాడీ లాంగ్వేజ్ మొత్తం పోయి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో విలన్ అవతారం ఎత్తి ఇప్పుడు అటు తెలుగు, ఇటు తమిళ్ ఇండస్ట్రీలో విలన్ గా సెటిల్ అయిపోయారు సునీల్..

- Advertisement -

సప్తగిరి..
ఒకానొక సమయంలో సక్సెస్ ఫుల్ కమెడియన్ గా పేరు దక్కించుకొని.. ఆ తర్వాత హీరోగా ట్రై చేశారు..కానీ మంచి కమెడియన్ అనిపించుకున్న సప్తగిరి కూడా హీరోగా ఫెయిల్ అయ్యారు.. సప్తగిరి ఎల్.ఎల్.బి, సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇలా పలు సినిమాలు చేసినా హీరోగా మాత్రం సక్సెస్ పొందలేకపోయారు..

శ్రీనివాస్ రెడ్డి:
ఒకప్పుడు మంచి టాలెంటెడ్ ఉన్నా కమెడియన్ గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా జంబలకడిపంబ వంటి సినిమాలు చేశారు.. కానీ సక్సెస్ కాలేదు.. ట్రై చేసిన మళ్లీ కమెడియన్ గానే కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు..

షకలక శంకర్:
జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న షకలక శంకర్ టాలీవుడ్ లో హీరోగా ఫెయిల్ అయ్యారు.. కామెడీ పాత్రలే సరిగ్గా రావడం లేదు అనుకుంటే హీరోగా రెండు మూడు సినిమాలు చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యి.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు.

ధనరాజ్:
జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ అనిపించుకున్న ఈయన పులిరాజా వంటి సినిమాలలో హీరోగా చేశాడు.. కానీ డిజాస్టర్ గానే నిలిచాడు.. ఇక ఇప్పుడు దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు..

ఇక వీరే కాకుండా ప్రియదర్శి , జబర్దస్త్ రాకేష్, జబర్దస్త్ శ్రీను, రంగస్థలం మహేష్ లాంటి వాళ్ళు ఎంతోమంది హీరోలుగా ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక ఇప్పుడు అభినవ గోమటం కూడా హీరోగా మారారు.. మస్తు షేడ్స్ వున్నాయ్ రా అనే సినిమాతో వస్తున్న ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు