Devara : భైరా ఆ టైం కి రాకపోతే దేవర టీం ప్లాన్ ఛేంజ్..

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో దేవర కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే గత ఏడాదిన్నర పాటు షూటింగ్ జరుపుకుంటున్న విజయదశమి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రెండు వందల కోట్ల కి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తంగం పాత్రలో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తుంది. ఇక ఈ దేవరకి ప్రతినాయకుడిగా భైరా గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ కి సంబంధించిన కొన్ని షూట్లు కూడా మేకర్స్ చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే గోవా లో స్టార్ట్ కానుందని సమాచారం వచ్చింది. అయితే ఈ షూటింగ్ విషయమై మరో వార్త తాజాగా అందడం జరిగింది.

గోవాలో భైరా.. టైం కి వస్తాడా?

దేవర లో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కొన్ని రోజుల కిందట షూటింగ్ లో గాయం కారణంగా బ్రేక్ ఇచ్చాడని తెలిసిందే. అందువల్ల అన్ని సినిమాల షూటింగ్ లకు సైఫ్ కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా దేవర తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని అతి త్వరలోనే అనగా మార్చి 19న ఈ సినిమా షూటింగ్ గోవా లో మొదలవుతుందని సమాచారం వచ్చింది. సైఫ్ అలీఖాన్ గాయం నుండి కోలుకున్నాడని దేవర నెక్స్ట్ షెడ్యూల్ లో గాయం నుండి పూర్తిగా కోలుకున్నాక భైరా గా సెట్స్‌లో సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అవుతున్నాడని తెలిసింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. మార్చి 19న గోవా లో జరగబోయే షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించాల్సి ఉంది. ఈ షెడ్యూల్ లోనే జాన్వీ కపూర్ కూడా ఎంట్రీ ఇస్తుందని సమాచారం.

- Advertisement -

టైం కి రాకపోతే ఆ గ్యాప్ లో సాంగ్..

కానీ సైఫ్ ఈ షెడ్యూల్ లోనే అడుగుపెడతాడని గ్యారెంటీ లేదు. ఎందుకంటే సైఫ్ పూర్తిగా కోలుకున్నాక గాని అడుగుపెట్టే ఛాన్స్ లేదని చిత్ర యూనిట్ సమాచారం. ఎందుకంటే తీసేది యాక్షన్ సీక్వెన్స్ కాబట్టి. మళ్ళీ గాయాల పాలు అయితే మూవీకి లాంగ్ బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. అయితే త్వరలో మొదలయ్యే ఈ షెడ్యూల్ లో సైఫ్ టైం కి అడుగుపెట్టకపోతే చిత్ర యూనిట్ మూవీ షెడ్యూల్ డిలే చేయకుండా మరో ప్లాన్ వేసారట. అదేంటంటే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి సైఫ్ డేట్ ల మీద ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందట. ఆ లోపు సైఫ్ వస్తే ఎన్టీఆర్, సైఫ్ మధ్య యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారట. లేదంటే ఆ గ్యాప్ లో సైఫ్ వచ్చేలోపు హీరో, హీరోయిన్ల మధ్య ఒక పాట చిత్రీకరణ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఒక రకంగా ఇది చాలా మంచిపని అని నెటిజన్లు భావిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ రాకపోతే షూటింగ్ వాయిదా వేయడం కన్నా, సైఫ్ లేని మిగతా సీన్లని షూట్ చెస్తే టైం వేస్ట్ అవదు. పైగా టైం కి తీసుకురావచ్చు. ఏది ఏమైనా దేవర పై ఈ షూటింగ్ గురించి మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు