Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. సిద్ధం కండి..!

Kalki 2898 AD : ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ప్రభాస్.. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది.. అంతేకాదు ఏకంగా రూ.700 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సాధించింది.. పైగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా ప్రభాస్ మరోవైపు బడా సినిమాలతో బిజీగా ఉన్నారు.. ప్రభాస్ లైనప్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. అలా ప్రభాస్ నటిస్తున్న సినిమాల లైనప్ లలో ఒకటి కల్కి 2898 ఏడీ.. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు..

రిలీజ్ డేట్ వాయిదా..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసాయని చెప్పవచ్చు. అలాగే పోస్టర్స్ కూడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. ఈ సినిమాలో ప్రభాస్ కూడా చాలా భిన్నంగా కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పై ఎన్నో రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాని మే 9వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని అంటున్నారు సినీ నిపుణులు.. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా నెలరోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ , గ్రాఫిక్స్ పనులు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అందుకే సినిమా విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి.. ఈ నేపథ్యంలోనే జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.. సిద్ధం కండి అంటూ ఒక వార్త వైరల్ గా మారింది..మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

కల్కి 2898 AD లో స్టార్ కాస్ట్..

ఇకపోతే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ను తీసుకున్నారు.. మొదట్లో విలన్ గా కమలహాసన్ నటిస్తారంటూ వార్తలు రాగా ఇందులో తాను విలన్ గా నటించడం లేదు అంటూ కమలహాసన్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈయన ఇందులో ఒక కీలక పాత్రలో మాత్రమే నటిస్తున్నట్లు సమాచారం.. ఈయనతో పాటు బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఇక ప్రభాస్ కి జోడిగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా.. దిశా పటాని స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది అని సమాచారం.

- Advertisement -

ప్రభాస్ సినిమాలు..

ప్రభాస్ కల్కి చిత్రం తర్వాత రాజా సాబ్, స్పిరిట్ సినిమాలు కూడా చేస్తున్నారు.. ఈ సినిమాల తర్వాత సలార్ పార్ట్ -2 లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు