Saindhav: వెంకటేష్, నాగ చైతన్య మరో మల్టీ స్టారర్- దర్శకుడు ఎవరంటే ?

రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్ మరియు నాగ చైతన్య మరో సారి వెండితెర పై కలిసి నటించబోతున్నారట. ఒక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ లోఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుపుతున్నట్టు సమాచారం అందుతోంది. రేపో మాపో ఈ రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు సినిమా గురించిన న్యూస్ అఫీషియల్ గా కూడా రాబోతుందని ప్రస్తుతం వార్త ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే మరీ ఈ ఇద్దరు మామ అల్లుళ్ళను కలిసి చేయబోతున్న సినిమాను డైరెక్ట్ చేయబోతుంది మరెవరో కాదు డైరెక్టర్ సురేందర్ రెడ్డి అని సమాచారం అందుతోంది. అవును.. ఇటీవలనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన గత కొద్దీ రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. కాగా సురేందర్ రెడ్డి ఇటీవలనే హీరో వెంకటేష్ ను కలిసి కథ వినిపించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం సైంధవ్ సినిమా పనుల్లో బిజీ గా ఉన్న వెంకటేష్ ఈ సినిమా రిలీజ్ తరువాత సురేందర్ రెడ్డి సినిమా చేయాలనీ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. ముందుగా ఈ పాత్ర కోసం వేరే వాళ్ళను డైరెక్టర్ అనుకున్న కూడా నాగ చైతన్య నే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని ఆయననే ఒప్పించే ప్రయత్నాలు చేయబోతున్నారట.

- Advertisement -

ఇక సరిగ్గా నాలుగేళ్ళ క్రితమే నాగ చైతన్య, వెంకటేష్ కలిసి వెంకీ మామ సినిమాలో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఈ మామ అల్లుళ్ళు కలిసి నటించబోతున్నారనే న్యూస్ వస్తుండటంతో దగ్గుబాటి, అక్కినేని అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేలు అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు