Animal: యానిమల్ కొంప ముంచేలా ఉందే.. ?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా యానిమల్ గురించి తెలిసిందే. రష్మిక మందన్న, రణ్ బీర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాటను కాసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అమ్మాయి అంటూ మెలోడీగా సాగే ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సాంగ్ ఆడియో వరకు అందరిని మెస్మరైజ్ చేస్తున్న వీడియో మాత్రం ప్రేక్షకులను టెన్షన్ పెడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ పాట మేకింగ్ పరంగా, విజువల్స్ పరంగా చూస్తే అచ్చు గుద్దినట్టు అర్జున్ రెడ్డి సినిమాను తలపిస్తోంది.

ఇటీవలనే యానిమల్ సినిమా నుంచి రణ్ బీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన టీజరప్పుడు కూడా ఇదే విధమైన కామెంట్స్ వచ్చాయి. కానీ కథ పరంగా అర్జున్ రెడ్డి సినిమాకు, యానిమల్ కు వైవిధ్యం కనిపించటంతో యానిమల్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ కాసేపటి క్రితం రిలీజైన పాట తో ఇప్పటి వరకు ప్రేక్షకులు పెట్టుకున్న అందరి అంచనాలను తారుమారు చేసాయి. అర్జున్ రెడ్డి సినిమాలోలాగానే యానిమల్ సినిమాలోను హీరో, హీరోయిన్స్ మాటిమాటికి ముద్దులు పెట్టుకోవడం, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం, యాక్ట్రెస్ బిహేవియర్ ఇలా అన్ని అంశాలు యానిమల్ లో కూడా కనిపించటంతో అర్జున్ రెడ్డి సినిమాకు యానిమల్ కు చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే దీనివల్ల జరిగే నష్టమేమైనా ఉందా.. అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం సౌత్ హీరోలతో నార్త్ డైరక్టర్స్ , నార్త్ హీరోలతో సౌత్ దర్శకులు సినిమాలు చేయడం ఇటీవల ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే. మరీ ఈ ట్రెండ్ లో మొదటి హిట్ గా జవాన్ సినిమా నిలిచింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది భారీ హిట్ గా నిలిచింది. అయితే జవాన్ సినిమాకు.. సౌత్ లో హిట్టైన మాస్ సినిమాలన్నీ కలిపి తీశారు అనే నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక లేటెస్ట్ గా చూస్తే అందరి చూపు యానిమల్ సినిమాపైనే ఉంది. జవాన్ సినిమాకు వచ్చినట్టే యానిమల్ సినిమాపైన కూడా ఇదే రకమైన నెగిటివిటీ వస్తే సందీప్ రెడ్డి వంగ కెరీర్ చిక్కులో పడే ప్రమాదం ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు