Animal: రణ్ బీర్ కపూర్ ఆ త్యాగం దానికోసమేనా..

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ బీర్ కపూర్ గురించిన ఒక న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఎప్పుడు పార్టీ లు పబ్ లు అంటూ నిత్యం జల్సాలు చేస్తుండే రణ్ బీర్ కపూర్ గత కొద్దీ రోజులుగా ఆల్కహాల్ మరియు నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నాడట. అయితే రణ్ బీర్ కపూర్ లో వచ్చిన ఈ సడన్ మార్పుకు కారణం ఏమై ఉంటుందా అని అందరిలో సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తున్న రణ్ బీర్, ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తెరకెక్కబోతుందట. ఇక ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా ఆయన భార్య అలియా భట్ లేదా సాయి పల్లవి నటించబోతున్నరని సమాచారం. .

అయితే ఈ సినిమా కోసమే రణ్ బీర్ కపూర్ పూర్తి నిష్ఠ తో సినిమా షూటింగ్ చేయాలనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ గా ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఏ న్యూస్ రాకపోయిన బాలీవుడ్ మీడియాలో మాత్రం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే రణ్ బీర్ కపూర్ నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోవడంలేదని వార్త వెలుబడటంతో నితీష్ తివారి రామాయణం గురించి వస్తున్న వార్తలు నిజమేనని అనిపిస్తోంది.

- Advertisement -

అయితే కొద్దీ నెలల క్రితమే రామాయణం ఆధారంగా ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తీసాడు. భారీ వ్యయం తో.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఇక ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ తో రామాయణం ఆధారంగా సినిమా వస్తుందనగానే ప్రేక్షకుల్లో ఆందోళన మొదలయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి నెగిటివ్ వాతావరణాన్ని దాటుకోని రన్ బీర్ కపూర్ రామాయణం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు