Thaman VS Boyapati: బోయపాటికి థమన్ కౌంటర్… అసలేమైంది?

ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే, టావీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే, ఫస్ట్ వచ్చే పేరు ఎస్ ఎస్ థమన్. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్ అవుతున్నాయి. కానీ, రీసెంట్ గా వచ్చిన స్కంద మూవీ మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. నిజానికి థమన్ మ్యూజిక్ అంటే, మార్క్ సాంగ్స్ కనీసం ఒకటి, రెండు అయినా ఉంటాయి. కానీ, స్కందలో థమన్ మార్క్ కనిపించలేదు.

ఈ విషయంపై బోయపాటి, థమన్ మధ్య చిన్న గొడవ జరిగిందనే వార్త వచ్చింది. కానీ అది నిజం కాదని అందరూ కొట్టి పడేశారు. అయితే తాజాగా థమన్ చేసిన ట్వీట్ చూస్తే, స్కంద రిజెల్ట్ వల్ల థమన్ – బోయపాటి మధ్య ఏదో జరిగే ఉంటుందని అర్థమవుతుంది. థమన్ తన ట్విట్టర్ లో అరవింద సమేత వీర రాఘవ మూవీ గురించి ప్రస్తావించాడు. సినిమా టైంలో రీ రికార్డింగ్, డాల్బీ మిక్సింగ్ తో ఇంట్రో సీన్, యాడబోయినావురో పాటకు తన కష్టాన్ని చెబుతూ ఫోటోలు కూడా షేర్ చేశాడు.

ఇప్పుడు అరవింద సమేత ప్రస్తావన ఎందుకు వచ్చింది. అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. ఈ డేట్‌కి అరవింద సమేతకు సంబంధమే లేదు. మరి ఎందుకు ఈ ట్వీట్. అంటే… ఇక్కడ కొన్ని సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం స్కంద డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యూజిక్ డైరెక్టర్ గురించి కొన్ని వ్యాఖ్యాలు చేశాడు.

- Advertisement -

అఖండ విజయం సాధించడంలో మ్యూజిక్ పాత్ర అంతలా ఏం లేదని, మ్యూజిక్ లేకుండా అఖండ మూవీ చూసినా అదే ఫీల్ ఉంటుందని, అంతే హిట్ అయ్యేదని చెప్పుకొచ్చాడు. అఖండ విజయం తన వల్లే అని కూడా అన్నాడు. ఆ వ్యాఖ్యలకు థమన్ ఇప్పుడు రియాక్ట్ అయ్యాడని తెలుస్తోంది. తన వర్క్ ఏంటో ఈ ట్వీట్ తో చెప్పాడని, బోయపాటికి కౌంటర్ వేశాడని అర్థమవుతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు