Raviteja : కెజియఫ్ యష్ గురించి నాకేమి తెలియదు వైరల్ అవుతున్న రవితేజ కామెంట్స్

వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ కామెంట్స్ ప్రస్తుతం కన్నడ మీడియాలో దుమారం రేపుతున్నాయి. రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రవితేజ కెజియఫ్ హీరో యష్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దాంతో ప్రస్తుతం రవితేజ పై సోషల్ మీడియా వేదికగా కన్నడిగులు ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశి దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు. భారీ బడ్జెట్ తో రవితేజ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వబోతున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ముంబై వేదికగా మేకర్స్ రిలీజ్ చేయగా.. బాలీవుడ్ నుంచి టైగర్ నాగేశ్వర రావు సినిమాకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఇక బాలీవుడ్ మీడియా ఇచ్చిన సపోర్ట్ ను దృష్టిలో పెట్టుకొని ఇండియా వైడ్ జోరుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మూవీ యూనిట్.

ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా విలేకరి.. కెజియఫ్ యాక్టర్ యష్ గురించి ఏమైనా చెప్పండి అని అడగగా రవితేజ ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ యష్ గురించి తనకేమి తెలియదని చెప్పాడు. కెజియఫ్ సినిమా అయితే చూసాను.. నాకు చాలా నచ్చింది. అంతే తప్ప యష్ గురించి పర్సనల్ గా తనకేమి తెలియదని రవితేజ చెప్పడం తో ఆయన కామెంట్స్ ప్రస్తుతం నెట్ లోవైరల్ మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు