TV Actress: ఈ బుల్లితెర నటికి ఎందుకింత క్రేజ్.. ఎపిసోడ్కి అన్ని లక్షలా..?

TV Actress: ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్.. ఎందుకంటే స్టార్ హీరోల విషయంలో ఈ నెంబర్ కోట్ల రూపాయలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రూ .100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు కూడా చాలామంది ఉన్నారు.. అలాగే బుల్లితెర పైన కనిపించే నటీ నటులు సైతం లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే వారు ఉన్నారు.. ముఖ్యంగా వెండితెర నటీనటులతో పోల్చుకుంటే బుల్లితెర నటీనటులకు రెమ్యునరేషన్ తక్కువే అయినా.. ఇందులో సెలబ్రిటీల క్రేజ్ ను బట్టి వారు అందుకునే పారితోషకం కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇకపోతే ఇక్కడ ప్రత్యేకంగా ఒక బుల్లితెర నటిమని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సాధారణంగా ఒక ఎపిసోడ్ కి రూ.20,000 లేదా రూ.30,000 తీసుకునే నటీనటులను మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఇక్కడ ఒక నటి మాత్రం ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కి ప్రస్తుతం కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటూ వార్తల్లో నిలిచారు.. బహుశా ఈమె గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ఏడేళ్లలోనే చైల్డ్ యాక్టర్ గా తన కెరీయర్ ను ప్రారంభించి.. ఇప్పటికీ బుల్లితెరపై నటిస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నది.. సీరియల్స్ లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్కి హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంది.. దాదాపుగా 22 ఏళ్ల పాటు ఇలానే కొనసాగుతోంది ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బుల్లితెర నటి రూపాలీ గంగూలి..

దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తె ఈమె. ఈమె సోదరుడు విజయ్ గంగూలీ కూడా పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.. రూపాలీ గంగూలి 1985లో ఏడేళ్ల వయసులోనే తన తండ్రి దర్శకత్వం వహించిన సాహెబ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2000 లో సుకన్య అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ లో నటించి విమర్శకుల నుంచి ప్రశంశలు సైతం అందుకున్నది..2005 లో బిగ్ బాస్ -1 సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో ఈ నటికి మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి.. అక్షయ్ కుమార్ ని సైతం తన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ఉంటుంది రూపాలి.. సీరియల్స్ లో నటిస్తూ ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కే వర్మాను వివాహం చేసుకుంద. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం రూపాలి సీరియల్ విషయానికి వస్తే… అణుపమా, నమస్తే అమెరికా అనే సీరియల్స్ లో నటిస్తోంది.. ఇండియాలో ప్రజా ధారణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించింది. ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా రూ .3లక్షల రూపాయలు అందుకుంటోందట. దాదాపుగా సీరియల్స్ ద్వారానే ఈమె 40 కోట్ల రూపాయల వరకు ఆస్తిని సంపాదించినట్లు తెలుస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు