Madhusudan Rao: కొడుకు చేసిన పనికి దుఃఖంలో ప్రముఖ నటుడు..!

Madhusudan Rao: 2024 లో సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు టాలీవుడ్ నుంచి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి . గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ ,నా సామి రంగ వంటి చిత్రాలు సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.. ఇందులో హనుమాన్, గుంటూరు కారం సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. సైంధవ్ జనవరి 13న, నా సామిరంగ ఆ మరుసటి రోజున రిలీజ్ కాబోతున్నాయి.. నా సామిరంగ మూవీలో విలన్ గా నటించిన మధుసూధన్ రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.

మధుసూధన్ రావు మాట్లాడుతూ.. తమది ఖమ్మం జిల్లా అని, తన తండ్రి ఒంగోలు అని తెలిపారు. చదువు అంతా కూడా కర్ణాటకలోనే పూర్తయిందని, తనను విలన్ గా గుర్తించిన డైరెక్టర్ దేవ కట్టా మాత్రమే అని తెలిపారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఆటోనగర్ సూర్య సినిమా తర్వాత తన దశ మారిపోయింది అని తెలిపారు. ఆ చిత్రంలో తన నటన చూసి.. అద్భుతంగా చేసావని చెప్పారే తప్ప అవకాశాలు మాత్రం ఎవరు ఇవ్వలేదని తెలిపారు. అందుకే తమిళ సినిమాలలో ఎక్కువగా నటించాను అంటూ తెలిపారు..

ఈయన భార్య శృతి కూడా విలన్ గా పలు సినిమాలలో నటించిందట. వీరికి ఇద్దరు కుమారులు.. ఒకరు ప్రీతం తనకు తెలియకుండానే సినిమా చేశారని.. ఆ సినిమానే ప్రభుత్వ జూనియర్ కళాశాల అని తెలిపారు. సినిమా పూర్తి అయిన తర్వాతనే తనకి చెప్పారని.. దీంతో షాక్ అయ్యానని తెలిపారు.. తన కళ్ళముందే ఎదుగుతున్నందుకు.. ఆనందం పట్టలేక ఏడ్చేసానని తెలిపారు. అయితే తన పేరు మాత్రం ఎక్కడా వాడకూడదని కండిషన్ కూడా పెట్టానని తెలిపారు మధుసూదన రావు..

- Advertisement -

ఇకపోతే కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. రోజంతా పనిచేస్తే కేవలం రూ.300 వచ్చేవని.. కెప్టెన్ విజయ్ కాంత్ అంటే చాలా ఇష్టమని అందుకే ఆర్మీ నుంచి యాక్టింగ్ వైపుగా అడుగులు వేశానని తెలిపారు. ఇన్నేళ్లలో వందల కోట్ల రూపాయలు సంపాదించారనుకుంటారు కానీ అలాంటిదేమీ లేదు లక్ష రూపాయలు వస్తే అందులో 30% జిఎస్టి పోతుంది..వీటితోపాటు తన మేనేజర్, మేకప్ వారికి డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది. వీటికి తోడు పలు సేవా కార్యక్రమాలను సహితం చేస్తూ ఉంటాను .ఎవరైనా డబ్బు సహాయం కావాలి అంటే చేస్తాను అని తెలిపారు. ఇప్పటికీ మలయాళం , భోజ్ పురి , తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో నటించాను. ఈసారి అవకాశం వస్తే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తానని తెలిపారు మధుసూదన రావు..

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు