Trivikram: గురూజీ అలక ఎవరిపై? “గుంటూరు కారం” ఎఫెక్ట్ వల్లే బయటకు రావట్లేదా?

ప్రస్తుతం “గుంటూరు కారం” సినిమా కంటే ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయట కనిపించకపోవడమే పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అసలు గురూజీ బయటకు ఎందుకు రావడం లేదు? ఇంతకీ ఆయన అలక ఎవరిపై? అంటే…

సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన “గుంటూరు కారం” అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డివైడ్ టాక్ తెచ్చుకోవడాన్ని మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఇది మహేష్ బాబు కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అంటూ త్రివిక్రమ్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ మహేష్ అభిమానులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ మహేష్ బాబుకి మరో ప్లాప్ సినిమాను ఇచ్చాడు అంటూ గురూజీపై మండిపడుతున్నారు. భారీ డిజాస్టర్ గా మిగులుతుంది అనుకున్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వల్ల 72% కలెక్షన్స్ రికవరీ అవ్వడం డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ బయట ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ కి, మహేష్ బాబు కి మధ్య ఈ సినిమా రిజల్ట్ విషయంలో గొడవ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ త్రివిక్రమ్ తనను బాగా వాడుకున్నాడు అంటూ కితాబుని ఇచ్చినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న వివాదాల వల్లే త్రివిక్రమ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన “గుంటూరు కారం” మూవీ సక్సెస్ పార్టీలో కూడా త్రివిక్రమ్ ఎక్కడా కనిపించలేదు.

అయితే “గుంటూరు కారం” మూవీ విషయంలో త్రివిక్రమ్ డిస్టర్బ్ అయ్యాడని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ టైంలో కూడా గుంటూరు కారం సినిమా కంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే గురూజీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడని మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ చేయడంతో త్రివిక్రమ్ వాటిని వ్యక్తిగతంగా తీసుకుని ఫీల్ అవుతున్నాడని అంటున్నారు. సినిమా మొత్తం చూస్తే ఎక్కడా కూడా త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం పట్ల మహేష్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల కంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచే నెగిటివ్ టాక్ రావడం గమనార్హం. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా త్రివిక్రమ్ “గుంటూరు కారం” సినిమా కోసం పెద్దగా శ్రమ పడలేదని, టైం కూడా కేటాయించలేదని, కేవలం మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ మాత్రమే ఈ సినిమాను నిలబెట్టింది అంటూ మూవీకి ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం త్రివిక్రమ్ అంటూ ఆయన వైపే వేలు చూపిస్తున్నారు. అందువల్లే “గుంటూరు కారం” మూవీ రిలీజ్ అయిన తర్వాత సినిమా ప్రమోషన్స్ కి గాని, ఇతర కార్యక్రమాలకు గాని త్రివిక్రమ్ హాజరు కావడం లేదని అంటున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు