Jayaram : ఈ నటుడికి పెళ్ళాంతో కాపురం చేయడం నచ్చదా? అన్ని సినిమాల్లోనూ అవే క్యారక్టర్లు !

మలయాళ సీనియర్ హీరో జయరాంకు టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాల్లో ఆయన ఎక్కువగా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. అయితే అన్ని సినిమాల్లోనూ ఈయన చేస్తున్న క్యారెక్టర్ లో కామన్ పాయింట్ ఒక్కటే. ఈ నటుడుకి పెళ్ళాంతో సరిగ్గా కాపురం చేయని భర్త క్యారెక్టర్ ని ఇస్తున్నారు మేకర్స్.

డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయరాం ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ నటుడు అయిపోయారు. డబ్బింగ్ సినిమాల నుంచి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే సీనియర్ నటుడిగా ఎదిగిన ఈయనను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అన్ని సినిమాల్లోనూ దాదాపుగా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపిస్తున్న జయరాం ఇప్పుడు తెలుగు సినీ ప్రియులకు బాగా సుపరిచితులు అయిపోయారు. “భాగమతి” సినిమాతో టాలీవుడ్ లో సీనియర్ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన జయరాం ఆ తర్వాత ధమాకా, రావణాసుర వంటి సినిమాలలో నటించారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో ఆయన పాత్రలు ఒకే తరహాలో ఉండడం గమనార్హం. “హాయ్ నాన్న” సినిమాలో జయరాం హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించారు. కానీ చివరి వరకు ఈ విషయాన్ని సస్పెన్స్ లో ఉంచిన డైరెక్టర్ చివరకు ఇతనే హీరోయిన్ తండ్రి అనే విషయాన్ని రివీల్ చేస్తాడు. అప్పటిదాకా హీరో తండ్రి పాత్రలో జయరాం నటించాడు అని భావించిన ప్రేక్షకులకు ఈ ట్విస్ట్ షాక్ ఇస్తుంది. ఈ సినిమాలో జయరాం ఆయన వైఫ్ తో కాపురం చేయరు. గొడవల కారణంగా వారిద్దరు దూరంగా ఉంటారు.

ఇక సంక్రాంతి కానుకగా రీసెంట్ గా రిలీజ్ అయిన “గుంటూరు కారం” సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో జయరాం కనిపించారు. గొడవ కారణంగా ఈ సినిమాలో ఆయనను భార్య వదిలి పెట్టి వెళ్ళిపోవడమే కాకుండా విడాకులు కూడా ఇచ్చేస్తుంది. పాతికేళ్ల పాటు భార్య భర్తలు కాపురం చేయరు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురంలో” సినిమాలోనూ జయరాం హీరో తండ్రి పాత్రలో కనిపించారు. అందులో టబు భర్త పాత్ర పోషించిన ఈయన గొడవల కారణంగా పెళ్ళానికి దూరంగా ఉంటారు. ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉన్నప్పటికీ భార్యాభర్తలు కాపురం చేయరు. ఈ మూడు సినిమాల్లోనూ ఆయనకు ఒకే రకమైన పాత్రను ఇచ్చారు దర్శకులు. అయితే ఆయన క్యారెక్టర్ ఒకే రకంగా ఉన్నప్పటికీ హీరో హీరోయిన్ల జీవితంలో కీలక మలుపు తిప్పే పాత్రను జయరాం పోషిస్తూ ఉండడం విశేషం. కాగా ఈ వెర్సటైల్ యాక్టర్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ “గేమ్ చేంజర్”లో కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. మరి ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు